జగన్‌తో దగ్గుబాటి : దగ్గుబాటి హితేశ్‌కి పౌరసత్వం చిక్కులు

ప్రకాశం : రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని తహతహలాడుతున్న దగ్గబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేశ్ చెంచురాంకు కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా దగ్గుబాటి..ఆయన తనయుడు హితేశ్‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెగ చర్చ జరిగింది. ఈ ఉత్కంఠకు జనవరి 27వ తేదీ ఆదివారం కొంత తెరపడినట్లు అనిపించింది. వీరిద్దరూ జగన్‌తో భేటీ కావడంతో ఇక పార్టీలో త్వరలోనే చేరుతారని కన్ఫామ్ అయిపోయింది.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం టికెట్ హితేశ్‌కి ఇచ్చే విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి పోటీ చేయాలని హితేశ్ ఆశిస్తున్నారు. అయితే హితేశ్ అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఈ పౌరసత్వం రద్దుకు దరఖాస్తు కూడా చేసుకున్నట్లు టాక్. అమెరికా పౌరసత్వం ఉన్నవారు భారత ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే విషయం తెలిసిందే. ముందుగా ఈ సమస్య పరిష్కరించుకోవాలని భేటీ సందర్భంగా జగన్ వారిద్దరికీ సూచించినట్లు తెలుస్తోంది. హితేశ్ అమెరికా పౌరసత్వం రద్దుకు ఆమోదం వచ్చిన తర్వాత దగ్గుబాటి, ఆయన కొడుకు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరుతారని టాక్. ఒకవేళ ఎన్నికల వరకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం హితేశ్‌కి టికెట్ ఇవ్వకుండా దగ్గుబాటికి ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ అండ్ సీ…