సీజ్ చేయటానికి మీకు నా బస్సులే కనిపిస్తున్నాయా : జేసీ ఫైర్ 

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 07:39 AM IST
సీజ్ చేయటానికి మీకు నా బస్సులే కనిపిస్తున్నాయా : జేసీ ఫైర్ 

Updated On : November 7, 2019 / 7:39 AM IST

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వంపై మండి పడ్డారు. జేసీ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కావాలనే కేసులు పెడుతున్నారని  ఆగ్రహం వ్యక్తంచేశారు. నా బస్సులనే ఎందుకు సీజ్ చేస్తున్నారు? కేవలం జేసీ ట్రావెల్స్ బస్సులు మాత్రమే రూల్స్ పాటించలేదా? మిగిలిన అన్ని ట్రావెల్స్ సక్రమంగానే పనిచేస్తున్నాయా? అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు.  
రూల్స్ పాటించని వాహనాలను సీజ్ చేయటం కరెక్టేనని అని అన్న జేసీ అన్ని వాహానాలకు ఆ రూల్ వర్తిస్తుంది. కానీ నా బస్సులపై మాత్రం కావాలని కేసులు పెడుతున్నారనీ ఇది సరైంది కాదన్నారు. ఈ రూల్స్ పాటిస్తూ ఈ ఐదు నెలల్లో ఎన్ని బస్సుల్ని సీజ్ చేశారు అంటు ప్రశ్నించారు.

ట్రిబ్యునల్ వదిలిపెట్టమని చెప్పినా తనకు సంబంధించిన 25 బస్సులను అధికారులు విడిచిపెట్టడం లేదని జేసీ అన్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించినా..ఎవరికైనా చెప్పుకోండి అనే తీరుతో వ్యవహరిస్తున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి మండి పడ్డారు. 74 సంవత్సరాలు ట్రాన్స్‌పోర్ట్‌లో తనకు అనుభవం ఉందని..దానికి సంబంధించిన రూల్స్ ఎటువంటివో తనకు తెలుసనీ..అధికారులు తీరు ఏమాత్రం సరైంది కాదన్నారు జేసీ.