పెద్దపల్లి రాజకీయాలు : BSP అభ్యర్థిగా వివేక్ ?
పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు ఈ స్థానం నుంచి TRS ఎంపీ అభ్యర్ధిగా వివేక్ పోటీ చేస్తారని అందరు భావించారు.

పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు ఈ స్థానం నుంచి TRS ఎంపీ అభ్యర్ధిగా వివేక్ పోటీ చేస్తారని అందరు భావించారు.
పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు ఈ స్థానం నుంచి TRS ఎంపీ అభ్యర్ధిగా వివేక్ పోటీ చేస్తారని అందరు భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వివేక్ పని చేశారంటూ.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌కు రిపోర్ట్ అందించారు. దీంతో కెసిఆర్ వివేక్‌ను పక్కన పెట్టి నేతకాని వెంకటేష్ పేరును ప్రకటించారు. ఇంత కాలం టిక్కెట్ వస్తుందనే ధీమతో ఉన్న వివేక్.. కేసీఆర్ ఇచ్చిన షాక్‌తో డైలమాలో పడ్డారు. పోలిటికల్ కెరిర్‌ను తీర్చి దిద్దుకునే పనిలో పడ్డారు.
Read Also : నాపై ఉన్న కేసు ఒక్కటే.. పోరాటం కేసిఆర్‌తోనే!
వివేక్ టిఆర్ఎస్ పార్టీని వీడితే ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్, బీజేపీల వైపు వెళుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ను ప్రకటించి ఆయనతో బి ఫామ్‌తో నామినేషన్ దాఖలు చేయించారు. వివేక్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. బీజేపీ నేతలు పలు మార్లు సంప్రదింపులు జరిపారు. అందుకోసమే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించకుండా బీజేపీ శనివారం మధ్యాహ్నం వరకు పెండింగ్‌లో పెట్టింది. వివేక్ మూడు డిమాండ్లను బిజెపి అధిష్టానం ముందుంచగా…ఒక అంశంపై క్లారీటి రాకపోవడంతో చర్చలు మద్యలోనే ఆగిపోయాయి. పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఎస్.కుమార్‌ను ఆపార్టీ ప్రకటించింది.
అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు చోట్ల డోర్ లు మూసుకుపోయాయి. దీంతో వివేక్.. బీఎస్పీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ తరపున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నామినేషన్లకు మార్చి 25వ తేదీ ఒక్కరోజే గడువు ఉంది. ఈ సమయంలోనే వివేక్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ ఎన్నికలకు ఆయన దూరం కాకతప్పదు.
Read Also : ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?