మహిళ చేతిలో పేలిన సెల్ ఫోన్ 

  • Published By: veegamteam ,Published On : February 2, 2020 / 06:32 AM IST
మహిళ చేతిలో పేలిన సెల్ ఫోన్ 

Updated On : February 2, 2020 / 6:32 AM IST

అనంతపురం జిల్లా గోరంట్ల బస్టాండ్ లో మహిళ చేతిలో సెల్ ఫోన్ పేలింది. గోరంట్లకు చెందిన ప్రకృతి తన కుటుంబంతో కలిసి హిందూపురం వెళ్లెందుకు బస్టాండ్ కు వచ్చారు. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో బంధువులంతో మాట్లాడేందుకు ప్రకృతి సతీమణి రష్మి సెల్ ఫోన్ తీశారు. ఆ ఫోన్ చేతిలోనే భారీ శబ్ధంతో పేలింది. 

దీంతో కంగుతున్న ఆమె వెంటనే ఫోన్ కింద పడేసింది. రష్మి చేతికి గాయం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే రాత్రి మొత్తం సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టడంతోనే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

గతంలో కూడా సెల్ ఫోన్ పేలిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. షర్ట్ జేబు, ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటనలు ఉన్నాయి. అలాగే మాట్లాడుతుండగా కూడా సెల్ ఫోన్స్ పేలాయి. చార్జింగ్ పెడుతుండగా కూడా సెల్ ఫోన్స్ పేలి పోయాయి. సెల్ ఫోన్ పేలిన ఘటనల్లో కొంతమంది చనిపోగా, మరికొంతమంది గాయపడ్డారు.