కలెక్టరేట్ లో రైతు ఆత్మహత్యాయత్నం

నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించాడు.

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 09:45 AM IST
కలెక్టరేట్ లో రైతు ఆత్మహత్యాయత్నం

Updated On : May 4, 2019 / 9:45 AM IST

నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించాడు.

మహబూబ్ నగర్ : నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. 2 ఎకరాల 24 గుంట భూమిని ఒకే ఒక్క ఎకరంగా పాస్ బుక్‌లో చేర్చారని.. దీని గురించి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పటంలేదని వాపోయాడు.

దీంతో మనస్తాపానికి గురైన నర్శింహులు అనే  రైతు కలెక్టరేట్ ఆవరణంలోనే  మందు తాగేశాడు.

దామరగిద్ద మండలం కాశంపల్లికి చెందిన నర్శింహులు అనే రైతు.. కొత్త పాస్ బుక్కులు పంపిణీ చేసే క్రమంలో తన భూమిని సక్రమంగా బుక్ లో నమోదు చేయాలని కొంతకాలంగా అధికారులను వేడుకుంటున్నాడు. కానీ తనకున్న 2 ఎకరాల 24 కుంటల భూమిని కేవలం ఒక్క ఎకరం అంటే 100 సెంట్లు గా మాత్రమే అధికారులు నమోదు చేశారు.

ఈ విషయంపై కలెక్టరేట్..  మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టు 6 నెలలుగా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. మనోవేదనకు గురైన నర్శింహులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన అధికారులు నర్శింహులుని హుటాహుటీగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చికిత్స అందించారు. కాగా, విషయం బైటపడకుండా చూడాలని అధికారులు డాక్టర్లకు తెలిపినట్లుగా తెలుస్తోంది.