మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత

టీఆర్ఎస్ నాయకులు…మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ముత్యం రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కపూర్. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
చెరుకు ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. తొలిసారిగా 1989 నుంచి 1999 వరకు దొమ్మాట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, తెలుగుదేశంలో సంక్షోభం తలెత్తడంతో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రివర్గంలో ముత్యంరెడ్డికి స్థానం దక్కింది. పౌరసరఫరాల మంత్రిగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. అయితే, 2004 ఎన్నికల్లో ఓడిపోయిన చెరుకు, చివరి సారిగా 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి చెందారు.శాసనసభ అంచనాల కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో.. నిరాశ చెందిన ఆయన ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ముత్యంరెడ్డి చివరి సారిగా 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ముత్యం రెడ్డి మృతిపట్ల తెలంగాణ సీఎఁ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.