బాబోయ్ దెయ్యం : శ్రీకాకుళంలో భయం భయం

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 06:47 AM IST
బాబోయ్ దెయ్యం : శ్రీకాకుళంలో భయం భయం

Updated On : April 24, 2019 / 6:47 AM IST

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామస్తులను దెయ్యం భయం పట్టుకుంది. గ్రామంలో దెయ్యం తిరుగుతోందని వారు తెగ భయపడుతున్నారు. రాత్రి పదిన్నర అయితే చాలు జనాలు వణికిపోతున్నారు. రాత్రివేళ పొలిమేరలో ఆడ దెయ్యం తిష్టవేసిందని, తమను భయభ్రాంతులకు గురిచేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎవరైనా అటు వెళ్తే రాళ్లు, ఇసుకతో దాడి కూడా చేస్తుందని అంటున్నారు. 7 అడుగుల ఎత్తుతో జుట్టు విరబూసుకుని ఉన్న ఆకారం రాత్రి వేళల్లోనే ప్రత్యక్షమవుతుందని భయభయంగా చెబుతున్నారు.

గ్రామస్తులు మాటలను జన విజ్ఞాన వేదిక సభ్యులు తోసిపుచ్చారు. దెయ్యాలు, భూతాలు అనేవి లేవని స్పష్టం చేశారు. మనిషిలో ఉన్న భయమే అలాంటి అపోహలకు కారణం అన్నారు. దీనిపై అధికారులు స్పందించి గ్రామస్తుల్లో చైతన్యం తీసుకురావాలని, వారిలోని అపోహలను తొలగించాలని కోరారు. రాళ్లు వెయ్యడం ఆకతాయిల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
Also Read : పిల్లలా ప్రొఫెషనల్ కిల్లర్సా : 9 మంది విద్యార్థుల హత్యకు బాలికల ప్లాన్