ఓట్లను తీయలేము: ఫామ్-7‌ లక్షల్లో వచ్చాయ్

  • Published By: vamsi ,Published On : March 11, 2019 / 02:31 AM IST
ఓట్లను తీయలేము: ఫామ్-7‌ లక్షల్లో వచ్చాయ్

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో దేశంలో పార్టీల మధ్య హీట్ మొదలైంది. పార్టీల నేతలు ఎవరికి వారు ఎజెండాలను ప్రిపేర్ చేసుకుంటూ సమరరంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9,27,542 ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయని  ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అందులో 7,24,914, వెరిఫై చేశామని, 5,25,957 రిజెక్ట్ చేశామన్నారు. ఇంకా 1,58,124 ఫామ్ 7‌లు పెండింగ్‌లో ఉన్నాయని జీకే ద్వివేదీ చెప్పారు. వీటిని కూడా పరిశీలిస్తామని, అందులో అసలైనవి 10వేల వరకు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, వీటికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామని, ఈసీ అనుమతితోనే డిలీట్ చేయాల్సి ఉంటుందన్నారు. సమయం తక్కువగా ఉండడం వల్ల పాత ఓటర్లను డిలీట్ చేయడం కుదరదని ద్వివేదీ స్పష్టం చేశారు.
కొత్త ఓటర్లు మార్చి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 25వ తేదీ నామినేషన్ల చివరి రోజు వరకు అవకాశం ఉందని, వెరిఫికేషన్ కోసం పది రోజులు పడుతుంది కాబట్టి ముందే దరఖాస్తు చేసుకుంటే మంచిదని ఆయన సూచించారు. తమ ఓటు ఉందో లేదో అని సందేహించేవారు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు 1950 నెంబర్‌లో కూడా చెక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.