‘Goosebumps,’తెప్పించే మహాదేవ్ శ్లోకం: భోజ్ పూర్ భక్తుడు శివ తాండవ స్త్రోత్రం చూసి తీరవల్సిందే..

  • Published By: nagamani ,Published On : July 17, 2020 / 05:20 PM IST
‘Goosebumps,’తెప్పించే మహాదేవ్ శ్లోకం: భోజ్ పూర్ భక్తుడు శివ తాండవ స్త్రోత్రం చూసి తీరవల్సిందే..

Updated On : July 17, 2020 / 5:37 PM IST

‘Goosebumps,’ Lord Parama Shiva devotee Tandav Stotramహర హర మహాదేవ్: భోజ్ పుర్ భక్తుడు పాడిన ‘Goosebumps,’ : శివ తాండవ స్త్రోత్రం
మధ్యప్రదేశ్ లోని భోజ్ పూర్ కు చెందిన ఓ శివభక్తుడు పాడిన ‘శివతాండవ స్త్రోత్రం’ వింటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. మహా శివుడిపై అతనికున్న భక్తి ప్రపత్తులు ఆ స్త్రోత్రంతోనే తెలుస్తోంది. సంస్కృతంలో ఉండే శివతాండవ స్త్రోత్రాన్ని చక్కటి ఉచ్ఛారణతో ఒళ్లుగగ్గుర్పొడిచేలా అతను పరమ శివుడిని స్త్రోత్రిస్తుంటే వినేఎవరికైనాసరే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

మధ్యప్రదేశ్ లోని భోజ్ పూర్ కు చెందిన ఓ శివభక్తుడు కాళీ చరణ్ మహారాజ్. అతను పాడుతున్న స్త్రోత్రానికి సాక్షాత్తు పరమశివుడే దిగి వస్తాడా అన్నట్లుగా ఉంది. అచ్చం రుషిలా కనిపించే ఆహార్యంతో పరమ శివుడిని కాళీచరణ్ మహారాజ్ స్త్రోత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను మూడు వీడియోల ద్వారా తన ట్విట్టర్ లో షేర్ చేశారు ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి. తన స్త్రోత్రంతో అందరినీ మంత్రముగ్థులను చేస్తున్నఈ వీడియోలను చూడండి.