EVM పుకార్లపై ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు : ఈసీ వార్నింగ్

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 06:37 AM IST
EVM పుకార్లపై ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు : ఈసీ వార్నింగ్

Updated On : April 11, 2019 / 6:37 AM IST

ఏపీ రాష్ట్రంలో పోలింగ్ బూత్ల్లో ఈవీఎం మొరాయింపులు, టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి పడుతుందని.. టీడీపీకి వేస్తే వైసీపీకి ఓటు పడుతుందని.. ఈవీఎంల్లో తప్పులు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఎలక్షన్ కమిషనర్ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 90వేల ఈవీఎంలు వినియోగిస్తున్నాం అని.. కేవలం 362 EVMల్లో మాత్రమే సాంకేతిక లోపం తలెత్తిందని.. వాటిలో 319 మెషీన్లను సరిచేశాం అని లెక్కలు ప్రకటించారు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడొద్దని, అనవసరంగా రాద్దాంతం చేయొద్దని పార్టీలతోపాటు పుకార్లు పుట్టించే వారికి వార్నింగ్ ఇచ్చారు కమిషనర్.

  • 30 శాతం ఈవీఎంలు అంటే సుమారు 27 వేల ఈవీఎంలు పని చేయడం లేదనే వారు నిరూపించాలన్నారు. 
  • కొన్ని కొన్ని ప్రాంతాల్లో సిబ్బందికి సరియైన అవగాహన లేకపోవడం వల్ల ఈవీఎంలు కొంతమేర పని చేయలేదన్నరు. 
  • సాయంత్రం 6గంటల వరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు. 
  • 6 ప్లేస్‌లలో జరిగిన ఘటనలలో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు
  • తెలిపారు. 
  • 12 ప్లేస్‌లలో 11 గంటల వరకు 4 శాతం ఓటింగ్ జరిగిందన్నారు. 
  • ఒక పార్టీకి వేస్తే వేరే పార్టీకి ఓట్లు పడుతున్నాయనేది వాస్తవం కాదన్నారు.
  • ఏజెట్ల సమక్షంలో మాక్ పొలింగ్ నిర్వహించిన అనంతరమే పోలింగ్‌ని ప్రారంభించినట్లు తెలిపారు. 
  • పుకార్లు నమ్మవద్దన్నారు ద్వివేది.