రాజోలులో భయం భయం : గ్రామ వాలంటీర్ మృతి
డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. వేగంగా ప్రబలుతూ మంచాన పడేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా

డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. వేగంగా ప్రబలుతూ మంచాన పడేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా
డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. వేగంగా ప్రబలుతూ మంచాన పడేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతపల్లిలో డెంగ్యూ ప్రబలింది. డెంగ్యూ వ్యాధి బారిన పడిన గ్రామ వాలంటీర్ ఝాన్సీ చనిపోయింది. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఝాన్సీ.. ఆదివారం(సెప్టెంబర్ 29,2019) పరిస్థితి విషమించి మృతి చెందింది. ఝాన్సీ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, ఊరిలో 15 రోజుల వ్యవధిలో డెంగ్యూ బారిన పడి ఐదుగురు చనిపోయారు. ఇంకా ఆసుపత్రిలో 40మంది చికిత్స పొందుతున్నారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. అయినా వైద్య అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. కొన్ని రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ రోగాలు ప్రబలుతున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి గ్రామంలో జ్వర పీడితుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
జ్వరాల్లో భయంకరమైనది డెంగ్యూ. దోమల వల్ల వ్యాపించే వైరల్ ఫీవర్. ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గి నీరసించిపోతారు. నిర్లక్ష్యం చేస్తే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూ వ్యాధికి ఆర్బోవైరస్ జాతికి చెందిన వైరస్ కారణం. ఈ వైరస్ ఎయిడిస్ ఈజిప్టి జాతి దోమ ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూను వ్యాపింపజేసే దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటి పూటే కుడతాయి. దోమలు కుట్టిన తర్వాత 5 నుండి 8 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు చేరకుండా చూసుకోవడం ద్వారా డెంగ్యూని నివారించొచ్చు. దీనికి టీకా మందు లేదు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్య పరీక్ష చేయించుకోవాలి. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. గ్లూకోజ్ తాగాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి పూట బాగా నిద్ర పోవాలి. దోమతెరలు, దోమలను పారదోలే రసాయనాలను వాడాలి. నిలవ నీరు లేకుండా చూసుకోవాలి. శరీరం పూర్తి కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. జ్వరం ఉన్న వారిని దోమ తెరలో ఉంచటం ద్వారా ఇంటిలోని మిగతా వారికి జ్వరం రాకుండా చేయొచ్చు.