డేంజర్ బెల్స్, గుంటూరులో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్ కు పాజిటివ్, 12మంది డాక్టర్లు క్వారంటైన్ కు
కరోనా వైరస్ మహమ్మారి ఏపీలో కల్లోలం రేపుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే

కరోనా వైరస్ మహమ్మారి ఏపీలో కల్లోలం రేపుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే
కరోనా వైరస్ మహమ్మారి ఏపీలో కల్లోలం రేపుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే టాప్ లో ఉన్న గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లకు కూడా కరోనా సోకింది. జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న 12 మంది డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురి రిపోర్ట్ రాగా, అందులో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 50 మంది కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు లాడ్జీని క్వారంటైన్ కేంద్రంగా మార్చిన అధికారులు.. డాక్టర్లు, వైద్య సిబ్బందిని అక్కడికి తరలించారు.
ఒక డాక్టర్, మెడికో, ఇద్దరు ఆర్ఎంపీలకు కరోనా:
జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీ లకు కరోనా సోకినట్టుగా అధికారులు చెప్పారు. దీంతో ఇద్దరు ఆర్‌ఎంపీల దగ్గర వైద్యం చేయించుకున్న దాదాపు 190 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మరోవైపు గుంటూరు జిల్లాలో 122 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో… జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. కాగా, గుంటూరు జిల్లాలోని ఫీవర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బ్రాడీపేటలోని వర్కింగ్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో డాక్టర్ ఉంటున్న హాస్టల్‌లో ఉన్న మొత్తం 35 మందిని మహిళలను క్వారంటైన్‌కు తరలించారు.
ఏపీలో 572కి చేరిన కరోనా కేసులు:
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం(ఏప్రిల్ 17,2020) కొత్తగా మరో 38 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలియజేశారు. వీటిలో కర్నూలు జిల్లాలో 13(మొత్తం 126), కృష్ణా జిల్లా 5, నెల్లూరు జిల్లా 6, అనంతపురం జిల్లాలో 5 గుంటూరు జిల్లా 4(మొత్తం 126), చిత్తూరు జిల్లా 4, కడప జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. ఈ 38 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు పెరిగింది. ఇందులో యాక్టివ్ కేసులు 523. వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 35మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 14మంది చనిపోయారు. గురువారం(ఏప్రిల్ 16,2020) కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి ఎక్కువమంది డిశ్చార్జ్ అవడం ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించే అంశం.
కరోనా కేసుల్లో గుంటూరు, కర్నూలు టాప్:
రాష్ట్రంలో కరోనా కేసుల్లో గుంటూరు(126), కర్నూలు(126)జిల్లాలు టాప్‌లో ఉన్నాయి. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.
గుంటూరు జిల్లా -126
కర్నూలు జిల్లా -126
నెల్లూరు జిల్లా -64
కృష్ణా జిల్లా -52
ప్రకాశం జిల్లా – 42
కడప జిల్లా – 37
పశ్చిమ గోదావరి జిల్లా – 34
చిత్తూరు జిల్లా – 28
విశాఖపట్నం జిల్లా -20
తూర్పుగోదావరి జిల్లా – 17
అనంతపురం జిల్లా -26
మొత్తం కేసులు -572