నా కండ‌లు చూడండి : పాండ్యా సిక్స్ ప్యాక్

వివాదాల అనంతరం బరిలోకి దిగిన పాండ్యా ఐపీఎల్‌లో తడాఖా చూపించాడు. ముంబై ఇండియన్స్ తరపున మైదానంలో హల్‌చల్ చేశాడు.

నా కండ‌లు చూడండి : పాండ్యా సిక్స్ ప్యాక్

Updated On : March 29, 2019 / 6:17 AM IST

వివాదాల అనంతరం బరిలోకి దిగిన పాండ్యా ఐపీఎల్‌లో తడాఖా చూపించాడు. ముంబై ఇండియన్స్ తరపున మైదానంలో హల్‌చల్ చేశాడు.

వివాదాల అనంతరం బరిలోకి దిగిన పాండ్యా ఐపీఎల్‌లో తడాఖా చూపించాడు. ముంబై ఇండియన్స్ తరపున మైదానంలో హల్‌చల్ చేశాడు. కొన్ని నెలలుగా బ్లూ జెర్సీకి దూరంగా ఉన్న పాండ్యా.. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో మెరిపించాడు. 
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా 14 బంతులు ఎదుర్కొని 3 సిక్సులు బాదాడు. ఆ తర్వాత స్టేడియంలోని అభిమానులకు తన చేతులకు ఉన్న కండలను బిగపట్టి మరీ చూపించాడు. 16 ఓవర్లు పూర్తయ్యాక జట్టు స్కోరు 145వద్ద ఉండగా పాండ్యా మైదానంలో అడుగుపెట్టాడు. చివరి వరకూ క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా.. (32; 14బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) మెరిపించాడు. 

ఇంతకుముందు ప్రాక్టీస్ సెషన్‌లోనూ తాను సిక్సులు బాదగలనని.. పోస్టులు పెట్టిన హార్దిక్ పాండ్యా గురువారం జరిగిన మ్యాచ్‌లో చేసి చూపించాడు. అ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది. 

Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష