విద్యార్ధినిలు..మహిళా టీచర్లపై హెడ్‌మాస్టర్ వేధింపులు : పరుగెత్తించి చితక్కొట్టేశారు  

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 08:47 AM IST
విద్యార్ధినిలు..మహిళా టీచర్లపై హెడ్‌మాస్టర్ వేధింపులు : పరుగెత్తించి చితక్కొట్టేశారు  

Updated On : December 23, 2019 / 8:47 AM IST

స్కూల్ హెడ్ మాస్టర్ కీచకుడిగా మారాడు. స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన విద్యార్థినిలను..పాఠాలు చెప్పటానికి వచ్చే మహిళా టీచర్లను వేధిస్తున్నారు. ఐ లవ్వ్యూ..అంటూ వేధింపులకు దిగాడు. ఫోన్ నంబర్ ఇవ్వు మాట్లాడుకుందామంటూ వెర్రి వేషాలు వేశాడు.

దీంతో హెడ్ మాస్టర్ రవీంద్ర వేధింపులతో స్కూల్ కు రావాలంటేనే ఆడపిల్లలు..మహిళా టీచర్లు భయపడుతున్నారు. వారు మౌనంగా ఉండటంతో మరింతగా రెచ్చిపోయిన రవీంద్ర వెర్రి చేష్టలు శృతి మించాయి. దీంతో ఊరుకునేకొద్దీ వీడు ఇలాగే రెచ్చిపోతాడని భావించి విద్యార్థినులు ధైర్యం చేసి హెడ్ మాస్టర్ రవీంద్రను చితక్కొట్టారు.  

తిరుపతి శివరులోని సత్యనారాయణపురంలోని గవర్నమెంట్ స్కూల్ లో హెడ్ మాస్టర్ రవీంద్ర విద్యార్ధినిలను టీచర్లను వేధిస్తుండటంతో విద్యార్ధినిలు వారి తల్లిదండ్రులకు చెప్పటంతో ఈరోజు స్కూల్ కు వచ్చిన వారు రవీంద్రను చితక్కొట్టారు. దీంతో రవీంద్ర వారి నుంచి తప్పించుకోవటానికి పరగులు పెట్టాడు. అయినా వారు వదల్లేదు రవీంద్ర వీపు విమానం మోత మోగించారు. వారితో పాటు విద్యార్ధినిలు కూడా తమ ప్రతాపాన్ని చూపెట్టారు. చదువులు చెప్పాల్సినోడివి ఈ వేషాలేంటీ? ఇంకోసారి ఇలా చేసావో జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.