ఉన్న ఒక్కఆవును అమ్ముకోవాల్సి వచ్చింది: ఆన్‌లైన్ క్లాసుల కోసం రూ.6వేలకు ఆవును అమ్మిన పేదతండ్రి

  • Published By: nagamani ,Published On : July 23, 2020 / 03:14 PM IST
ఉన్న ఒక్కఆవును అమ్ముకోవాల్సి వచ్చింది: ఆన్‌లైన్ క్లాసుల కోసం రూ.6వేలకు ఆవును అమ్మిన పేదతండ్రి

Updated On : July 23, 2020 / 3:37 PM IST

పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఓ నిరుపేద తండ్రి తన కుటుంబానికి కడుపు నింపుతున్న గోమాతను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తనలా తన పిల్లలు చదువు లేకుండా కష్టపడకూదని ఆశించిన తండ్రి వేరే దారి లేక తనకున్న ఒక్క ఆవును అమ్ముకుని పిల్లకు ఆన్ లైన్ చదువులు అందించటానికి సిద్ధపడ్డాడు. దాని కోసం గుండెను రాయి చేసుకుని ఆవును అమ్మేసుకున్నాడు. ఈ విపత్కర విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ప్రాంతంలో జరిగింది.

కరోనా తెచ్చిన కష్టం..లాక్‌డౌన్ దెబ్బ ఎందరో జీవితాలను అతలాకుతలం చేసేశాయి. స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి.ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియదు. దీంతో స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసుల్ని మొదలుపెట్టాయి. ఈ ఆన్ లైన్ చదువులు పేద పిల్లలపై వారి కుటుంబాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ పేద రైతుకు కూడా అదే కష్టం వచ్చింది. తన పిల్లల చదువు కోసం ఏకంగా తనకున్న ఒక్క ఆవును అమ్ముకోక తప్పలేని దుస్థితి ఏర్పడింది.

హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ప్రాంతంలోని గుమ్మేర్ గ్రామంలో కులదీప్ కుమార్ అనే రైతుకు ఇద్దరు పిల్లలు. అన్ను4th క్లాసు, డిప్పు 2nd క్లాసు చదువుతున్నారు. తనలా పిల్లలు కష్టపడకూడదని ఇంత కాలం కష్టపడి చదివిస్తున్నాడు. పులిమీద పుట్రలా ఆన్ లైన్ క్లాసులతో మరింత కష్టాలు ముంచుకొచ్చాయి. ఆన్ లైన్ క్లాసులను అందిపుచ్చుకోవాలంటే స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని పిల్లలు చదివే స్కూల్ చెప్పింది.

రోజంతా కష్టపడితే కానీ కుటుంబంలో అంతా కడుపునిండా తిండికూడా తినలేని పరిస్థితి. పడే కష్టాని తోడుగా పెంచుకునే ఓ ఆవు మాత్రమే ఆధారంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ ఎలా కొనాలో తెలీయలేదు. తన దగ్గర కనీసం రూ.500లు కూడా లేవు..రూ.కనీసం 6,000పెట్టి స్మార్ట్ ఫోన్ ఎలా కొనగలని వాపోయాడు. అప్పు పుట్టే పరిస్థితి అంతకన్నాలేదు. దీంతో చేసేదేమి లేక తనకున్న ఒక్క ఆవును రూ.6వేలకు అమ్మి ఫోన్ కొని పిల్లలకు ఇవ్వాల్సి వచ్చింది.

కులదీప్‌కు సొంత ఇల్లు కూడా లేదు. కష్టపడి కట్టుకున్న ఓ మట్టి ఇంట్లోనే కుటుంబంతో ఉంటున్నాడు. ప్రభుత్వం నుంచి నిత్యావసరాల కోసం బీపీఎల్ కార్డు దరఖాస్తు చేసుకున్నా అదికూడా అందలేదు. తన పేదరికం పరిస్థితిని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కనీసం తనకు బీపీఎల్ కార్డును కూడా ఇవ్వలేదని మీడియా విలేఖరితో వాపోయాడు కులదీప్.

కులదీప్ ఆవును అమ్ముకుని పిల్లకు ఫోన్ కొన్న విషయం జ్వాలాముఖి నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ ధవాలాకు తెలిసింది. దీనిపై స్పందించిన ఆయన పిల్లల చదువుల కోసం స్మార్ట్ ఫోన్ కొనటానికి ఆవును అమ్ముకోవటం చాలా బాధాకరమన్నారు. కులదీప్ కు ఆర్థిక సహాయం అందజేస్తామని..దానికి సంబంధించి స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు.కానీ అది ఎంతవరకూ అమలు జరుగుతుందో తెలియాల్సి ఉంది.