హుజూర్ నగర్ ఉప ఎన్నిక : క్యూ కట్టిన ఓటర్లు

  • Published By: madhu ,Published On : October 21, 2019 / 04:39 AM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక : క్యూ కట్టిన ఓటర్లు

Updated On : October 21, 2019 / 4:39 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 21న సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అప్పటికే ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 302 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే..గత ఎన్నికలతో పోలిస్తే మందకొడిగా పోలింగ్ సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వృద్దులు, వికలాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

1500 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 79 సమస్యాత్మక కేంద్రాలు ఈసీ గుర్తించింది. 7 మండలాల్లో 302 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లున్నారు. 
ఈ స్థానంపై అందరి దృష్టి నెలకొంది. ఓటర్ ఎలాంటి తీర్పునిస్తాడోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ పార్టీలు అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. కంచుకోటను కాపాడుకొనేందుకు కాంగ్రెస్, తొలిసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరి ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడో తెలుసుకోవాలంటే అక్టోబర్ 24వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. 
Read More : తెలంగాణకు భారీ వర్ష సూచన : అరేబియా సముద్రంలో అల్పపీడనం