హైదరాబాద్ ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

  • Published By: nagamani ,Published On : July 23, 2020 / 08:33 AM IST
హైదరాబాద్ ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

Updated On : July 23, 2020 / 8:47 AM IST

హైదరాబాద్‌లో ఇఫ్లూలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లీష్, ఫారిన్ లాంగ్వేజెస్ వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫసర్‌గా పని చేస్తున్న బి.రాహుల్ (45) ఆత్మ‌హ‌త్య చేసుకోవడం కలకలం రేపింది. బుధవారం (జులై 22,2020)ఉదయం ఈ ఘ‌ట‌న ఓయూ పీఎస్ ప‌రిధిలోని.. తార్నాకలో చోటు చేసుకుంది. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు రాహుల్. రాహుల్ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావటంతో అనుమానించిన అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు రాహుల్ ప్లాట్ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేపట్టారు. రాహుల్ స్వస్థలం విజ‌య‌వాడ. భార్య‌తో విభేదాల కార‌ణంగా.. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తార్నాకలోని శ్రీకర్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న రాహుల్ జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఉస్మానియా యూనివ‌ర్సిటీ పీఎస్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.