Watch viral video: ‘నన్ను పెళ్ళి చేసుకో..’ అంటూ ఏడుస్తూ నడిరోడ్డుపై యువకుడి వెంటపడ్డ అమ్మాయి.. అబ్బాయి పరుగో పరుగు

'నన్ను పెళ్ళి చేసుకో' అంటూ ఏడుస్తూ నడిరోడ్డుపై ఓ యువకుడి వెంటపడింది ఓ అమ్మాయి. దీంతో అబ్బాయి ఆమె నుంచి తప్పించుకోవడానికి రోడ్డుపై పరుగులు తీశాడు. అయినప్పటికీ అతడిని ఆ అమ్మాయి వదలలేదు. ఈ ఘటన బిహార్‌లోని నవాడాలోని భగత్ సింగ్ చౌక్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారి నిశ్చితార్థం మూడు నెలల క్రితమే జరిగింది. పెళ్ళి కొడుకుకి కట్నంగా పెళ్ళి కూతురి తల్లిదండ్రుడు ఓ బైకు, రూ.50 వేలు కూడా ఇచ్చారు. అయితే, వరుడు ఎందుకో పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. చివరకు అబ్బాయిని పట్టుకుంది అమ్మాయి.

Watch viral video: ‘నన్ను పెళ్ళి చేసుకో..’ అంటూ ఏడుస్తూ నడిరోడ్డుపై యువకుడి వెంటపడ్డ అమ్మాయి.. అబ్బాయి పరుగో పరుగు

Watch viral video

Updated On : August 31, 2022 / 10:57 AM IST

Watch viral video: ‘నన్ను పెళ్ళి చేసుకో’ అంటూ ఏడుస్తూ నడిరోడ్డుపై ఓ యువకుడి వెంటపడింది ఓ అమ్మాయి. దీంతో అబ్బాయి ఆమె నుంచి తప్పించుకోవడానికి రోడ్డుపై పరుగులు తీశాడు. అయినప్పటికీ అతడిని ఆ అమ్మాయి వదలలేదు. ఈ ఘటన బిహార్‌లోని నవాడాలోని భగత్ సింగ్ చౌక్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయికి, అబ్బాయికి పెద్దలు పెళ్ళి చేయడానికి నిశ్చయించారు.

వారి నిశ్చితార్థం మూడు నెలల క్రితమే జరిగింది. పెళ్ళి కొడుకుకి కట్నంగా పెళ్ళి కూతురి తల్లిదండ్రులు ఓ బైకు, రూ.50 వేలు కూడా ఇచ్చారు. అయితే, వరుడు ఎందుకో పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ పెద్దలు మరోసారి ముహూర్తం పెట్టి వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్ళి కుమారుడి అక్కడకు వెళ్ళలేదు. దీంతో అతడిని మార్కెట్లో గుర్తించిన వధువు అతడి వెంట పడి దయచేసి నన్ను పెళ్ళి చేసుకో అంటూ బతిమిలాడుకుంది.

ఆ యువకుడు అందుకు ఒప్పుకోలేదు. తనను పెళ్ళి చేసుకుని తీరాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఆమె బంధువులు కూడా ఆ యువకుడి వద్దకు వచ్చారు. అమ్మాయిని నుంచి తప్పించుకున్న అబ్బాయి నడిరోడ్డుపై పరుగులు తీశాడు. చివరకు ఆ అమ్మాయి, అబ్బాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

అబ్బాయికి పట్టుకోవడానికి అమ్మాయి పరుగులు

India exercising with Russia: రేపటి నుంచి రష్యా సైనిక విన్యాసాలు.. పాల్గొననున్న భారత్, ఇతర దేశాలు.. అమెరికా ఆందోళన