ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లన్నీ రద్దు

ఏపీలో  ఇరిగేషన్  ప్రాజెక్టుల్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, 25 శాతం లోపు మాత్రమే పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందులో ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) విలువ కన్నా అధిక ధరలకు దాఖలైన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని పేర్కొంది.

  • Published By: chvmurthy ,Published On : September 13, 2019 / 01:49 AM IST
ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లన్నీ రద్దు

Updated On : September 13, 2019 / 1:49 AM IST

ఏపీలో  ఇరిగేషన్  ప్రాజెక్టుల్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, 25 శాతం లోపు మాత్రమే పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందులో ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) విలువ కన్నా అధిక ధరలకు దాఖలైన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని పేర్కొంది.

ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, 25 శాతం లోపు మాత్రమే పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో టెండర్లను రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) విలువ కన్నా అధిక ధరలకు దాఖలైన టెండర్లను తక్షణమే రద్దు చేయాలంది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా వీటిపై నిర్ణయాలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల్లో అవసరమైన పనులకు మాత్రమే రివర్స్ టెండర్లు పిలవాలని ఆదేశించారు.

ఐబీఎం విలువ కన్నా తక్కువకు దాఖలైన టెండర్లలో 25 శాతంలోపు పనులు జరిగితే వాటిని పునఃపరిశీలించాలని సూచించారు. అందులో ఏ ప్రాజెక్టయినా అవసరమనుకుంటే కొనసాగించాలని..లేదంటే రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సీఎం జగన్ అధ్యక్షతన గురువారం (సెప్టెంబర్ 12) క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై జరిగిన సమీక్షలో పలు అంశాలపై సమీక్షించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే రూ.లక్ష కోట్లకు పైగా అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. వీటిపై ఏడాదికి రూ.10 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగల పరిస్ధితులు ఉన్నందున ప్రాజెక్టుల ప్రాధాన్యతా క్రమాన్ని వివరిస్తూ నివేదికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే నాలుగేళ్లలో ఏ సంవత్సరం ఏ ప్రాజెక్టు పూర్తి చేయగలరో ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు.

దేవుడి దయవల్ల రెండోసారి కృష్ణనదికి వరద వచ్చిందని, వరద నీటిని సద్వినియోగం చేసుకోవటంలో మరింత అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, జంఝావతి, వంశధార రెండో దశ, నేరడి బ్యారేజి తదితరాలపై ఒడిశా రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని… వీటిపై ఆ రాష్ట్ర సీఎంతో చర్చిద్దామని సీఎం చెప్పారు. పల్నాడు ప్రాంతాన్ని ఇంతవరకు నాయకులు సరిగా పట్టించుకోలేదని.. ఆ ప్రాంతానికి సాగు, తాగునీరు ఇవ్వాలని సీఎం చెప్పారు.