భూములిస్తే సరిపోదు : కన్నీటితో రోడ్డెక్కిన గృహిణులు

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 05:59 AM IST
భూములిస్తే సరిపోదు : కన్నీటితో రోడ్డెక్కిన గృహిణులు

Updated On : December 20, 2019 / 5:59 AM IST

ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు..మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాల మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి గడప దాటి బైటకు రాని మహిళలు కూడా రోడ్డెక్కారు.

మా పిల్లల భవిష్యత్తు ఏంటీ అంటూ బేల చూపులు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారితే రాజధానులనే మార్చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ కింద ఇచ్చిన భూముల్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చాం..కానీ ఇప్పుడు రాజధానినే లేకుండా నామమాత్రపు రాజధాని అంటూ సీఎం ప్రకటనతో ఇంటిలో కళకళలాడుతు తిరగే ఇంటి ఇల్లాళ్లు మొహాల్లో చిరునవ్వు మాయమైంది. ఆందోలన నెలకొంది. కన్నీటి చెలమలైన కళ్లతో రోడ్డుపై బైఠాయించారు. మా  పిల్లల చదువులు..వారి భవిష్యత్తు ఏమైవుతుందననే ఆందోళన వారి ముఖాలలో కనిపిస్తోంది. 

రక్తాన్సైనా చిందిస్తాం..అమరావతి రాజధానిని సాధిస్తాం..ప్రాణాలైనా అర్పిస్తాంఅమరావతిని సాధిస్తాం..మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజధానే ముద్దు అంటూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోని రైతులతో పాటు రైతు కుటుంబాల్లోని మహిళలు కూడా రోడ్డుపై కూర్చుని ఆందళన వ్యక్తంచేస్తున్నారు.  మహిళలు రోడ్డు మీదనే వంటా వార్పూ చేసి తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. 

ఆడబిడ్డలతో కన్నీరు పెట్టిస్తున్న ప్రభుత్వాలు నిలవవు అని శపిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కోపాన్ని సీఎం జగన్ ప్రజలపై చూపుతున్నారనీ..ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. మూడు రోజులు కాదు 30 రోజులైనా రోడ్డుపై బైఠాయించి అమరావతిని కాపాడుకుంటామంటున్నారు.  

అమరావతి రైతుల నుంచి రాజధాని కోసం తీసుకున్న భూముల్ని ప్రభుత్వం ఇచ్చేస్తానంటోంద కదా..మరి ఇంకెందుకు ఈ బాధ అనే ప్రశ్నకు సమాధానంగా మహిళలు మాట్లాడుతూ..భూములు ఇచ్చేస్తే తాము స్థలాలుగా మారిపోయిన భూముల్ని తాము ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఐదు సంవ్సరాల నుంచి పంటలు వేసుకోలేని స్థలాల్ని తాము ఏం చేసుకోవాలని వాపోతున్నారు. చంద్రబాబు కోసం తాము పంటలు పండే భూముల్ని ఇవ్వలేదనీ..మనకంటూ ఓ రాజధాని ఏర్పడుతుందని ఇచ్చామని ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. మీ భూములు మాకొద్దు..రాజధానుల్నే మార్చేస్తామనటం ఏంటూ ప్రశ్నిస్తున్నారు.