ఏం దొరికిందో : టీడీపీ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతున్నాయి. ఇదంతా కుట్రలో భాగమేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈయన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో ఉన్నారు. అంతేకాదు..ఈయన టీటీడీ ఛైర్మన్ కూడా. ఎన్నికల్లో భాగంగా పుట్టా సుధాకర్ యాదవ్ ఏప్రిల్ 03వ తేదీ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటికి IT ఆఫీసర్స్ వచ్చారు. ఆరు మంది అధికారులు అక్కడకు చేరుకుని ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఎవరినీ రానివ్వడం లేదు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఎమి స్వాధీనం చేసుకున్నారనేది తెలియరాలేదు. ఈ దాడులపై పుట్టా రెస్పాండ్ అయ్యారు. వైసీపీ నేతలు దురుద్దేశ్యంతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనవద్ద అక్రమ ధనార్జన లేదని..చట్టం ప్రకారం అన్ని రికార్డులున్నాయని చెప్పుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇందులో భాగం ఉందన్నారు.