పర్యటనలపై ఉత్కంఠ : ఢిల్లీకి బాబు..జగన్

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 04:05 AM IST
పర్యటనలపై ఉత్కంఠ : ఢిల్లీకి బాబు..జగన్

Updated On : February 4, 2019 / 4:05 AM IST

విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార విపక్ష నేతలిద్దరూ ఒకే రోజు ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే హస్తినకు చేరుకున్న జగన్…ఫిబ్రవరి 04వ తేదీ 11.30గంటలకు సీఈసీ సునీల్ అరోరాను కలుస్తారు. ఏపీ రాష్ట్రంలో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయని..నకిలీ ఓట్లపై విచారణ జరిపించాలని కోరనున్నారు. 

ఇక బాబు ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లి…టీడీపీ ఎంపీలు, నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత… వివిధ జాతీయ పార్టీల నేతలతో చంద్రబాబు విడిగా సమావేశమయ్యే అవకాశముంది. అన్ని పార్టీలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు సీఈసీ దగ్గరకు వెళ్లనున్నారు.