ఏం జరుగుద్ది.. చచ్చిపోతాం.. ఒక్కడిగానే పార్టీ పెట్టా: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ముఖ్య నాయకులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. రాజకీయ అనుభవం ఉన్నా కూడా మళ్లీ పార్టీ పెట్టడానికి చాలా ధైర్యం కావాలని, ఏం జరుగుద్ది మహా అయితే చచ్చిపోతాం అనుకుని జనసేన పార్టీ పెట్టానని చెప్పారు పవన్ కళ్యాణ్. ధైర్యంగా ఒకడు మాట్లాడాడు అనుకుంటే చాలు అందుకే జనసేన పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
పిరికివాడిలా బతకాలని అనుకోలేదు.. అని, ఇన్ని పుస్తకాలు చదివి భయపడితే ఎలా.. అంబేడ్కర్, గాంధీజీ భావజాలం అర్థం చేసుకుని కూడా ప్రశ్నించేందుకు నిలబడకపోతే ఎలా? అనే ఉద్ధేశ్యంతో పార్టీని నిలబెట్టినట్లు చెప్పారు. ఎవరైనా పార్టీ పెట్టేముందు మేథావులు, న్యాయవాదులతో చర్చిస్తారని, ఎంతోమంది మేధావులు కలిసి పార్టీ పెడుతారని అన్నారు.
అయితే నేను పార్టీ పెట్టేటప్పుడు వాళ్లు ఎవరు లేరని, మన కులం.. ఇంకో కులం కలిస్తే.. మరో కులాన్ని కొట్టొచ్చు అనే రాజకీయాలు చెయ్యకుండా యువతను నమ్మి పార్టీ పెట్టానని అన్నారు. గట్టిగా ఒక అరుపు అరిస్తే పారిపోమే వాళ్లు నాకొద్దు.. ఓటమి ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం కావాలి. నీ కుటుంబం, నీ కులం కాకపోతే చంపేయండి అనే భావజాలం ఉన్నవాళ్లు తనకు వద్దని అన్నారు పవన్ కళ్యాణ్.
Also Read | కరోనాపై డోంట్ వర్రీ: ప్రజలు భయపడతారని అన్ని వివరాలు చెప్పట్లేదు : సీఎం కేసీఆర్