పవన్ హామీలు : స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్.. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం
ఎన్నికల సమయంలో జనసేనానీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల వరాలు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో. .

ఎన్నికల సమయంలో జనసేనానీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల వరాలు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో. .
ఎన్నికల సమయంలో జనసేనానీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల వరాలు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో. .ప్రజలకు వివరిస్తున్నారు పవన్. ఇంటర్ స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్‌లు ఇస్తామని..రైతులకు పెన్షన్ కింద రూ. 5వేలు..మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్ష..చీర – సారె పథకం కింద మరో రూ. 10, 116 ఇస్తామని వెల్లడించారు. మహిళలు 10 నుండి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.
Read Also : రాహుల్ హామీ : ఏడాదిలోనే 22లక్షల ఉద్యోగాలు భర్తీ
ఏప్రిల్ 01వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొని టీడీపీ..వైసీపీలపై విమర్శల బాణాలు సంధించారు. ఉనికిని చాటు కోవడం కోసం..మార్పు రావాలని కోరుకొనే వ్యక్తి అన్నారు. టిడిపిని విమర్శలు చేయడం లేదని అంటున్నారు కానీ 2018లోనే టీడీపీ ఓడిపోయిందన్నారు. సైకిల్ ఛైన్ తెగిపోయిన పార్టీ..స్టాండ్ వేసుకుని తొక్కుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్ట్ నర్ అంటూ జగన్ విమర్శలు చేస్తున్నారని..అమిత్ షా పార్ట్ నర్ జగన్ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు..చట్ట సభలకు వెళ్లలేని వ్యక్తి ఏం పాలిస్తాడని విమర్శలు చేశారు.
జనసేన రాగానే..
* మొదటి సంతకం రైతుకు 5 వేల రూపాయల పెన్షన్ ఇచ్చే ఫైల్‌పై సంతకం.
* పంట సాగు చేయడానికి కోసం రూ. 8వేలు ఇస్తాం.
* ఆడపడుచులు చదువుకోవడానికి పదో తరగతి 18 సంవత్సరాలు నిండిన రూ. లక్ష వారి పెళ్లి కోసం ఇస్తాం..చీర – సారే పథకం కింద రూ. 1,116 ఇస్తాం.
* మా ఇంటి మహాలక్ష్మి పథకం
* 10 నుండి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. పుష్కరాలు చేయను..ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా.
* రేషన్ బదులు రూ. 2500 నుండి రూ. 3000 వరకు సొంత ఖాతాల్లో వేస్తాం.
* ప్రతి మండలానికి డిగ్రీ కాలేజీలు. డొక్కా సీతమ్మ క్యాంటీన్‌లు ఏర్పాటు.
* అన్ని పరీక్షలకు ఒకటే ఫీజు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
* పదో తరగతి నుండి పూర్తయి ఇంటర్ వచ్చే విద్యార్థులకు ల్యాప్ టాప్ ఇస్తాం.
* తాడేపల్లి గూడాన్ని స్మార్ట్ సిటీగా నిర్మాణానికి కృషి.
Read Also : పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు ATM : మోడీ కొత్త డైలాగ్