విశాఖను స్మార్ట్ సిటీ చేస్తా..ఓటర్లు గెలవాలి : జేడీ

ఎన్నికల్లో అభ్యర్థులు కాదు..ఓటర్లు గెలవాలని, తాను గెలిస్తే విశాఖను స్మార్ట్ సిటీ..సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. విశాఖ ఎంపీ స్థానానికి జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో ఉన్న లక్ష్మీనారాయణ..ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజల నుండి స్పందన బాగానే ఉందంటున్నారు జేడీ. ఆయనతో 10tv ముచ్చటించింది. వారి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలపై తాను మాట్లాడడం జరుగుతోందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటర్ గెలిస్తే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని..విశాఖపట్టణం ఒక మినీ ఇండియా..ఇక్కడి ప్రజలు ఆలోచనపరులు..ఈ ప్రాంతంపై ఆసక్తి ఉన్నవారని అభివర్ణించారు. ఎంపీని..ప్రజల్లో కలవకూడదని అనే భావనలు పెట్టుకుంటే ప్రజలు మమేకం కారన్నారు. విశాఖలో 25 సంవత్సరాల్లో ఏ విధంగా మారబోతోందనే దానిపై తాను మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. తనపై వస్తున్న విమర్శలపై ఆయన సమాధానం ఇచ్చారు. నాన్ లోకల్..అంటూ విమర్శలు గుప్పిస్తున్న వారు చేసిన పనులు చూపించలేక ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు. సొంత గనులు లేకపోతే టెన్షన్ ఉంటుందన్న జేడీ..ఓబుళాపురం గనుల్లో మంచి ఐరన్ కంటెంట్ ఉందన్నారు లక్ష్మీనారాయణ.