టీటీడీ బోర్డు సభ్యునిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణం

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 06:23 AM IST
టీటీడీ బోర్డు సభ్యునిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణం

Updated On : September 23, 2019 / 6:23 AM IST

టీటీడీ కొత్త ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఎన్నికైన మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలో.. దేవదేవుడు శ్రీవారి ఈ ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందించారు. టీడీపీ బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ భక్తులకు సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారాయన. ఈ అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

సభ్యునిగా సామాన్య భక్తులకు ఎక్కువ సేవ చేయటానికి ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని ప్రార్థించారు రామేశ్వరరావు. సామాన్య భక్తులకు మరింతగా స్వామి దర్శనం ఉండే విధంగా బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందన్నారాయన. ప్రపంచం మొత్తాన్ని స్వామి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. దేవుడి సమక్షంలో భక్తులను సేవ చేయటం అనేది అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారాయన.

ఇప్పటికే పాలకమండలి సభ్యులుగా ఎన్నికైనవారు ప్రమాణస్వీకారాన్ని పూర్తిచేశారు. ఈక్రమంలో అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ దర్శకర్తల మండలి తొలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై  చర్చించి బోర్డు ఆమోదం తెలుపనుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై పాలక మండలి సభ్యులు చర్చించనున్నారు. అనంతరం ముడి సరుకుల కొనుగోళ్లుపై కూలకషంగా చర్చించి నిధులు కేటాయింపులు, భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాల కొనుగోలు, అర్చకుల పదవీ విరమణ వంటి కీలక అంశాలపై సభ్యులు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.