ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 02:08 PM IST
ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి

Updated On : September 9, 2019 / 2:08 PM IST

ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో లక్ష్మణ్ రెడ్డి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి లేదా రిటైర్డ్ న్యాయమూర్తిని లోకాయుక్తగా నిర్మించాలని నిబంధనలను సవరించారు. 

అందులో భాగంగానే ఏపీ సీఎం జగన్.. జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. లక్ష్మణ్ రెడ్డి పేరుకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ ఆమోదముద్ర వేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్య దర్శులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, విచారించే అధికారం లోకాయుక్తకు ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్‌ విప్‌, ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపై అయినా లోకాయుక్త విచారణ జరుపవచ్చు. అయితే జడ్జీలు, జ్యుడీషియల్‌ సర్వీసు సభ్యులు మాత్రం దీని పరిధిలోకి రారు.