కె.ఏ.పాల్ తల్లి కన్నుమూత

  • Published By: madhu ,Published On : February 11, 2019 / 05:01 AM IST
కె.ఏ.పాల్ తల్లి కన్నుమూత

విశాఖపట్టణం : క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కిలారి సంతోషమ్మ అనారోగ్యంతో బాధపడుతూ విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈమె వయస్సు 78 సంవత్సరాలు. ఈ విషయాన్ని కేఏ పాల్ స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ప్రభువుతో ఆమె కలిసిపోయిందని.. జనవరిలో ఆమెతో మాట్లాడడం జరిగిందని జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు.

ప్రజాశాంతి తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని.. తన తల్లి సంతోషమ్మ సూచించినట్లు చెప్పుకొచ్చారు. సొంత ఇల్లు, కారు, ఒక్క రూపాయి లేకపోయినా.. నిత్యం పేదల బాగు కోసం ఆమె ప్రార్థించే వారని గుర్తు చేసుకున్నారు. ఆమె కన్నుమూయడంతో ప్రపంచమంతా సంతాపాన్ని తెలుపుతోందని కె.ఏ.పాల్ సందేశంలో స్పష్టం చేశారు.  ఆమె అంత్యక్రియలు పాల్ ఆడిటోరియంలో ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని ప్రకటించారాయన.