సిరిసిల్లలో 3 వేల ఇళ్ల స్థలాల పంపిణీ

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 11:32 AM IST
సిరిసిల్లలో 3 వేల ఇళ్ల స్థలాల పంపిణీ

Updated On : February 20, 2019 / 11:32 AM IST

రాజన్న సిరిసిల్ల:  అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో 3,052 మంది లబ్ధిదారులకు కేటీఆర్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు.. ఇళ్లకు సంబంధించిన అన్ని వివిరాలు తమ వద్ద ఉన్నాయనీ..ఇళ్లు గురించి ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని కష్టపడి పనిచేస్తేనే డబ్బులొస్తారనీ..దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

 ప్రతీ ఒక్కరికీ స్వంత ఇళ్లు ఉండాలనేది సీఎం కేసీఆర్ కల అని..అందరీ ఇళ్లు కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారనీ తెలిపారు. మిగిలిన వారికి త్వరలోనే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్లలో త్వరలోనే రూ.200కోట్లతో రహదారి, భూగర్భ కాల్వల పనులు చేపడతామనీ..పేదరికం తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.సిరిసిల్ల చేనేతకారులు తయారు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ చేసి వారికి ఉపాధి అవకాశాలను పెంచుతున్నామన్నారు. 

బతుకమ్మ చీరల్లో మరిన్ని డిజైన్లు తీసుకు వచ్చి..నేతన్నలకు, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.ఐదేళ్లలో సిరిసిల్లను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది.. రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. అపూర్వమైన విజయాన్ని నాకు అందించిన సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకోలేనిదనీ కేటీఆర్ తెలిపారు. బీడీ, నేతకార్మికుల 40ఏళ్ల కల నెరవేరుతోంది. జీవో నెం.58 కింద లక్షా 25వేల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కేటీఆర్ పేర్కొన్నారు.