భారత్ బంద్ లో భాగంగా వామపక్షాల ఆందోళన : ఒంగోలు, కడపలో 20 మందికిపైగా అరెస్టు
దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఏపీలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రకాశం జిల్లాలో వామపక్ష నేతలు ఆర్టీసీ డీపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు.

దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఏపీలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రకాశం జిల్లాలో వామపక్ష నేతలు ఆర్టీసీ డీపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు INTUC, AITUC, CITU, TUCC సంఘాలు మద్దతు తెలిపాయి. కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందని, దీంతో ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు 10 కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా.
దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఏపీలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రకాశం జిల్లాలో వామపక్ష నేతలు ఆర్టీసీ డీపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు. ఒంగోలులో ఆందోళన చేస్తున్న 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్ లో భాగంగా కడప జిల్లాలో వామపక్ష నేతలు బస్సులను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.
విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ సమ్మె కారణంగా ఇవాళ పలు రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాంక్ యూనియన్లు ముందుగానే ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేశాయి.