లోక్ సభ ఎన్నికలు 2019 : ఇందూరుకు కేసీఆర్

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 12:25 PM IST
లోక్ సభ ఎన్నికలు 2019 : ఇందూరుకు కేసీఆర్

తెలంగాణ పొలిటిక్స్‌ వేడి వేడిగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే..ఆ పార్టీకి గట్టి షాక్‌లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నేతలు, ఇతర లీడర్స్ టీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. టీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ దళపతి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. 
Read Also : నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

16 సీట్లు, ఎంఐఎం సీటుతో కలిపి 17 సీట్లు గెలుచుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎంపీలను గెలిపించుకొంటే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందని కేసీఆర్ చెబుతున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం తనకు కలిసొచ్చిన జిల్లా కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు కేసీఆర్. కేటీఆర్ ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 19వ తేదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ ఎన్నికల సభ నిర్వహించనున్నారు. ఇక్కడి నుండి ఆయన కూతురు కవిత ఎన్నికల బరిలో నిలువనున్నారు.

కేసీఆర్ వస్తుండడంతో జిల్లా మొత్తం గులాబీమయంగా మారిపోయింది. గిరిరాజ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ జరుగనుంది. నేతలు సభ సక్సెస్ కోసం ఏర్పాట్లలలో నిమగ్నమయ్యారు. సభకు భారీ ఎత్తున జనాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ, సీఎం తనయ కవిత పోటీ చేసే స్థానం కావడంతో టీఆర్‌ఎస్‌ ఈ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇప్పటికే కవిత నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి క్రియా శీలక కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. 
Read Also : కేరళలో కొత్త వైరస్ : పిల్లలు చచ్చిపోతున్నారు, ఆందోళనలో ప్రజలు