వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 09:32 AM IST
వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య

చిత్తూరు : మదనపల్లి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి భార్య శైలజ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తిప్పారెడ్డికి  వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించటంపై ఆయన తన అనుచరులతో  సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తిప్పారెడ్డి భార్య శైలజ కంటతడి పెట్టారు. వైసీపీ తమను నిలువునా ముంచేసిందని..పార్టీకి సేవ చేసి తాము కష్టాలపాలయ్యామని..ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
Read Also : బాపట్ల వైసీపీలో విభేదాలు : కోన v/s చీరాల గోవర్థన్ రెడ్డి

ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ఆస్తులను కూడబెట్టుకోలేదని..తన భర్త ప్రముఖ డాక్టర్ అయినప్పటికీ ప్రాక్టీసును కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పాటుపడ్డారన్నారు. ఇంతకాలం తన భర్తను పార్టీ కోసం పాటుపడిన ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవటానికి గల కారణమేంటో తనకు అర్థం కావటంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

అనంతర తిప్పారెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వటంలేదనే విషయంపై పార్టీ ఇప్పటికీ కారణం చెప్పటంలేదనీ..ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నారు తప్ప వివరణ మాత్రం ఇవ్వటంలేదన్నారు. తన టిక్కెట్ ను ఇచ్చిన మైనార్టీ నేత నవాజ్ భాషాపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. నవాజ్ భాషా తాను అద్దెకుంటే ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తే ఆ వివాదాన్ని తానే పరిష్కరించానని.. అటువంటి వ్యక్తికి తన స్థానాన్ని కేటాయించి తనను పక్కకు నెట్టేశారని తిప్పారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

అటువంటివారికి అధికారాన్ని కట్టబెడితే ప్రజల ఆస్తులను కూడా దోచేసుకుంటారని విమర్శించారు. అటువంటి వ్యక్తులకు పార్టీ ప్రాధాన్యతనిస్తోందనీ..తనలా పార్టీకి సేవ చేసేవారిని మాత్రం అవమానకర రీతిలో బైటకు గెంటేశారని తిప్పారెడ్డి వాపోయారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. కాగా మూడు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశానికి ఆయన అనుచరులు భారీగా తరలివచ్చారు. 
Read Also : ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా