మంత్రి సంతకం ఫోర్జరీ: టీడీపీ నేత అని అనుమానం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అయితే సంతకం మాత్రమే కాదు.. లెటర్ హెడ్‌ను కూడా దొంగలించారు. కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డారు.
ఈ వ్యవహారంఫై డీజీపీకి, హోం మంత్రి సుచరిత లకు ఫిర్యాదు చేశారు మంత్రి. తన లెటర్ హెడ్, మరియు సంతకాన్ని ఫోర్జరీ చేయడంఫై రెడ్డప్పఫై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిని కోరినట్లు చెప్పారు తానేటి వనిత.
రాష్ట్రంలో మంత్రి సంతకం, లెటర్ హెడ్ ఫోర్జరీ కావడంతో ఆంధ్ర ప్రదేశ్ అధికార వర్గంలో చర్చాంశంగా మారింది. ఆ లెటర్ హెడ్ ఫై కలెక్టర్ కి మంత్రి తరపున సిఫారసు లేఖ రాసి ఉంది.
రెడ్డప్పకి అసైన్డ్ భూములు కేటాయించాలి అన్నట్లుగా లేఖలో ఉంది. అయితే మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడంతో రెడ్డప్ప దొరికిపోయాడు. అయితే ఆ వ్యక్తి టీడీపీ నేత అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.