వరంగల్ మానస హత్యాచారం కేసు : నిందితుడు సాయి అరెస్ట్

వరంగల్ హంటర్ రోడ్డులో మానస సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (నవంబర్ 27)న వరంగల్ లో మానస మృతదేహాం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి గౌడ్ మద్యం తాగి..అతని స్నేహితులు మానసపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సాయితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
పుట్టిన రోెజు నాడు మిస్ అయిన మానస కేసును అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం హత్యాచారం కేసుగా నిర్థారించారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా సాయిని..అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మానస ఎవరినో ప్రేమించిందనీ..ప్రేమ పేరుతో కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కానీ పోలీసుల ఈ దారుణం జరిగిన 24గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.
దీనదయాళ్‌నగర్‌లో నివాసం ఉండే 19 ఏళ్ల మానస పుట్టిన రోజు నాడు గుడికి వెళ్లి వస్తానని చెప్పి బైటకు వెళ్లింది. ఎంతకీ రాకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బంధువులు..మానస స్నేహితులను అడిగారు. కానీ ఆచూకీ తెలియకపోవటంతో భయాందోళనలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో వరంగల్ హంటర్ రోడ్డులో ఓ యువతి శవం పడి ఉందనే సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు మానస మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహానికి కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు ఉన్నాయి. దీంతో ఆ పరిసరాల్లో సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దోషులు సాయిని అతని స్నేహితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.