శవాల్ని..7గురు చిన్నారుల్ని తినేసిన నరమాంస భక్షకుడుకి 62 ఏళ్ల తరువాత అంత్యక్రియలు

  • Published By: nagamani ,Published On : July 25, 2020 / 10:52 AM IST
శవాల్ని..7గురు చిన్నారుల్ని తినేసిన నరమాంస భక్షకుడుకి 62 ఏళ్ల తరువాత అంత్యక్రియలు

నరమాంస భక్షకులు అనే మాట పురాణాల్లో విని ఉంటాం. లేదా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో కూడా బతికున్న మనుషులను చంపి తినేసేవాడు ఓ వ్యక్తి. అది కూడా చిన్నపిల్లల్ని.అలా ఎనిమిదిమంది చిన్నారుల్ని చంపి తినేసిన ఘోరాతి ఘోరమైన ఘటనలో సదరు నరమాంస భక్షకుడుని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.ఇది జరిగి 60ఏళ్లైంది. అంటే అతను చనిపోయి ఉంటాడనే అనుకుంటున్నారుకదూ..నిజమే ఆ రాక్షసుడు చనిపోయాడు. కానీ అతడి మృతదేహాన్ని మాత్రం ఖననం చేయలేదు. మ్యూజియంలో మమ్మీగా భద్రపరిచారు.

ఇప్పుడు ఆ నరమాంస భక్షకుడి మృతదేహానికి అంత్యక్రియలు జరపనున్నారు. ఇది ఎక్కడా..ఆ నరమాంస భక్షకుడి వివరాలు తెలుసుకుంటూ వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. మనకు తెలీకుండానే చిన్నారుల్ని గుండెలకు పొదువుకుంటాం..అంతటి ఘోరమైన చరిత్ర ఈ నరమాంస భక్షుడిది…!!

సైనికుడిగా విధులు నిర్వహించే ఆ వ్యక్తి నరమాంస భక్షకుడి పేరు ‘Si Quey’. చైనాకు చెందినవాడు.రెండో ప్రపంచ యుద్ధంలో చైనా తరపున పోరాడాడిన సైనికుడు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం చైనా బలగాలను చుట్టుముట్టినప్పుడు తన ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం థాయిలాండ్ పారిపోయాడు. ఆ సమయంలో అతడు తినడానికి చుట్టూ చనిపోయి ఉన్న సైనికుల శవాలు తప్ప ఏమి కనిపించలేదు. దీంతో ఆకలికి తట్టుకోలేక ఆ శవాల్నే తిని ఆకలి తీర్చుకునేవాడు. అలా అతడికి మనుషులను తినడం అలవాటైంది. అలా..ఓ ఇంట్లో పని చేసుకుంటూ కాలం గడుపుతున్న సమయంలో కూడా అతడిలో నరమాంసభక్షణకు అర్రులు చాచేవాడు. మనిషి మాంసం రుచి మరిగిన పులిలా మారాడు.

అలా ‘Si Quey’ పనిచేస్తున్న ఇంటి పరిధిలో ఏడుగురు పిల్లలు చనిపోయారు. మృతదేహాల్లో మాత్రం చిన్నారుల అవయవాలు కనిపించకుండాపోయేవి. ఈ వరుస ఘటనలు స్థానికంగా పెను సంచలనం కలిగించాయి. స్థానికులు తమ చిన్నారుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండేవారు. ఏడుగురు పిల్లలు చనిపోవటం..వాటిలో అవయవాలు కనిపించకుండా పోవటంతో..పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

కళ్లల్లో ఒత్తులు వేసుకుని పోలీసులు నిర్విరామంగా చేస్తున్న దర్యాప్తులో భాగంగా ఓ రోజు అంటే 1958వ సంవత్సరంలో రేయాంగ్ ప్రావిన్స్ లో ఓ పిల్లవాడి శవాన్ని దహనం చేస్తూ ‘Si Quey’ రెడ్ హ్యాండెండ్ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని అనుమానించి కాల్చి చంపారు.

అలా అతని శవాన్ని దహనం చేయకుండా పరిశోధన కోసం ప్రత్యేక రసాయనాల్లో భద్రపరిచి మమ్మీగా మార్చి సిరిరాజ్ ఆసుపత్రి మెడికల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈక్రమంలో థాయ్ లాండ్ లో ఎవరన్నా తప్పు చేస్తే ‘Si Quey’ వచ్చి మిమ్మల్నిపట్టేసుకుంటాడు అనే మాట సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా పిల్లలు అల్లరిచేసినా..చెప్పిన మాట వినకపోయినా వారి తల్లిదండ్రులు ‘Si Quey’ వచ్చేస్తాడు అంటూ భయపెడుతుండేవారు.

కానీ ‘Si Quey’ మమ్మీని ప్రదర్శనకు పెట్టటాన్ని మానవహక్కుల సంఘాలు వ్యతిరేకించాయి.నరమాంస భక్షకుడిగా ముద్ర పడిన వ్యక్తిని అలా ప్రదర్శనకు పెట్టకూడదని ఇది సమాజంపైనా..ముఖ్యంగా చిన్నారుల్లో భయాలకు కారణమవుతాయని కాబట్టి ‘Si Quey’ మమ్మీన్ని ప్రదర్శనలోంచి తీసేయాలని డిమాండ్ చేశాయి. అప్పటి నుచి ‘Si Quey’ మమ్మీ సిరిరాజ్ ఆసుపత్రిలోనే ఉండేది.

ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇన్నాళ్టికి అంటే 62 సంవత్సరాల తరువాత ‘Si Quey’ మమ్మీకి గురువారం (జులై23,2020)న థాయ్ లాండ్ కు ఉత్తరాన 20మైళ్ల దూరంలో ఉన్న నోంతబురి ప్రావిన్స్ లోని ఒక ప్రాంతంలో బౌద్ధ సంప్రదాయం ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా ‘Si Quey’ను పోలీసులు కాల్చి చంపిన తరువాత అతని కోసం ఎవ్వరూ రాలేదు. అతని తరపు బంధువులు కూడా ఎవ్వరూ రాలేదు. దీంతో ఎప్పటికైనా అతని తరపు వారుగానీ లేదా చైనా ప్రభుత్వం గానీ అడిగితే సమాధానం చెప్పుకోవటం కోసం థాయ్ లాండ్ ‘Si Quey’ను మమ్మీగా తయారు చేసినట్లుగా తెలుస్తోంది.