మైలవరానికి రూ.100 కోట్లు.. మంగళగిరికి రూ.200 కోట్లు పంపారు

పోలవరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చెబుతున్న కేసీఆర్‌.. సుప్రీం కోర్టులో కేసులు ఎందుకు వేశారో చెప్పాలని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 04:31 AM IST
మైలవరానికి రూ.100 కోట్లు.. మంగళగిరికి రూ.200 కోట్లు పంపారు

Updated On : April 9, 2019 / 4:31 AM IST

పోలవరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చెబుతున్న కేసీఆర్‌.. సుప్రీం కోర్టులో కేసులు ఎందుకు వేశారో చెప్పాలని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.

అమరావతి : పోలవరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చెబుతున్న కేసీఆర్‌.. సుప్రీం కోర్టులో కేసులు ఎందుకు వేశారో చెప్పాలని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్తున్న కేసీఆర్‌.. పోలవరంపై కేసులు ఎందుకు వేయించారని నిలదీశారు. అప్పుడు పోలవరంపై కేసులు వేసి.. ఇప్పుడేమో అడ్డం కాదని చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌వి అన్నీ బూటకపు హామీలేనని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ మాట ఇవ్వడం లాంటిదే ఇది అని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు

పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తుందా?అని ప్రశ్నించారు. 2019 జులై నాటికి గ్రావిటీతో నీరు వచ్చేలా చేసిన ఘనత చంద్రబాబుదని, పోలవరం పునాదులే దాటలేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్‌ తప్ప లక్షలాది మంది పోలవరం ప్రాజెక్టు చూసి తమ ఆనందం పంచుకుంటున్నారని దేవినేని ఉమా అన్నారు.

కేసీఆర్‌ నుంచి జగన్‌ రూ.వెయ్యి కోట్లు రిటర్న్‌ గిఫ్ట్‌ తీసుకున్నారని దేవినేని ఉమ ఆరోపంచారు. రూ.1000కోట్లకు అమ్ముడిపోయి.. కేసీఆర్‌ చెప్పింది జగన్‌ చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. కేసీఆర్‌కు సామంతుడి మారిన జగన్.. ఆంధ్రపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. తనని, మంత్రి లోకేశ్‌ని ఓడించేందుకు మైలవరానికి రూ.100 కోట్లు, మంగళగిరికి రూ.200 కోట్లు కేసీఆర్‌, కేటీఆర్‌ పంపారని ఆరోపించారు. పారుపల్లి నాగేశ్వరరావు అనే దళారీ కేసీఆర్‌ వద్ద రూ.100 కోట్లు తీసుకొచ్చి మైలవరంలో ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు.
Read Also : జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి