సీమలో ప్రచారం : వైసీపీలోకి మోహన్ బాబు

సీమలో ప్రచారం : వైసీపీలోకి మోహన్ బాబు

Updated On : March 26, 2019 / 5:47 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మోహన్ బాబు జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయ్యారు కలెక్షన్ కింగ్. చాలాసేపు ఇద్దరూ చర్చించుకున్నారు. మోహన్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వారం రోజులుగా చంద్రబాబు ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారాయన. ఫీరీయింబర్స్ మెంట్ విషయంలో టీడీపీ అబద్దాలు చెబుతుందని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శలు చేశారు. తిరుపతిలో ధర్నాకి కూడా దిగారు. స్టూడెంట్స్ తో ర్యాలీ చేశారు. 
మోహన్ బాబు ఉద్యమంపై ప్రభుత్వం కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చెల్లించినవి – చెల్లించాల్సినవి ఇవే అంటూ లెక్కలు బయటపెట్టింది. టీడీపీ వర్సెస్ మోహన్ బాబు అన్నట్లుగా మాటల యుద్ధం కూడా నడించింది.
ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో మోహన్ బాబు ఉద్యమం చేపట్టటాన్ని టీడీపీ తప్పుబట్టింది. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని.. దొంగచాటుగా ఎందుకు వైసీపీలో జాయిన్ అయ్యి మాట్లాడొచ్చు కదా అని చురకలు కూడా అంటించింది టీడీపీ.
ఈ రాద్దాంతం నడుస్తున్న సమయంలో మోహన్ బాబు జగన్ పార్టీలో అధికారికంగా జాయిన్ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మంచు ఫ్యామిలీ జగన్ తరపున క్యాంపెయిన్ నడిపించనున్నట్లు క్లియర్ అయ్యింది.