ముంబై : వాయిస్ టెస్ట్ తో కరోనా ఉందో లేదో చెప్పేస్తారు..

  • Published By: nagamani ,Published On : August 10, 2020 / 10:17 AM IST
ముంబై : వాయిస్ టెస్ట్ తో కరోనా ఉందో లేదో చెప్పేస్తారు..

Updated On : August 10, 2020 / 11:14 AM IST

ఓ మనిషికి కరోనా లక్షణాలున్నయనే అనుమానం వస్తే..శాంపిల్స్ సేకరించాలి. టెస్టింగ్ కిట్లు కావాలి లేదా ల్యాబ్ కి పంపించి టెస్టులు చేయాలి. రిజల్ట్ వచ్చేందుకు రెండు మూడు రోజులు వెయిట్ చేయాలి. కానీ బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త టెక్నాలజీతో కేవలం మనిషి వాయిస్ టెస్ట్ ద్వారా ఆ మనిషికి కరోనా సోకిందో లేదో చెప్పే న్యూ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.



కరోనా సోకిందని అనుమానించే వ్యక్తిని వ్యక్తిని సెల్ ఫోన్ లో గానీ, కంప్యూటర్ ద్వారా గానీ మాట్లాడితే..ఆ మాటలను హై టెక్నాలజీతో విశ్లేషించి..ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చుతగ్గులను పరిశీలించి..అతడి రోగ లక్షణాలను అంచనా వేయడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో అభివృద్ధి చేశారు.

సాధారణంగా ఓ వ్యక్తి గట్టిగా మాట్లాడాలంటే ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా కీలకంగా ఉంటుంది. కానీ కరోనాతో ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు ఆ వ్యక్తి వాయిస్ నుంచి వచ్చే వాయిస్ బలహీనంగా వస్తుంది. ఆ బలహీన ధ్వనులను ఈ టెక్నాలజీ పసిగడుతుంది. ఈ వాయిస్ టెస్ట్ టెక్నాలజీని వచ్చే వారం గుర్గావ్ లో 1000మంది కరోనా అనుమానితులకు ఈ వాయిస్ టెస్ట్ లు చేసి పరిక్షిస్తామని.. అదనపు మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని శనివారం (ఆగస్టు9,2020) తెలిపారు. కాగా..ఈ వాయిస్ టెస్ట్ టెక్నాలజీని ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి.



కాగా..దేశంలో కరోనాతో అత్యధికంగా కేసులున్న నగరాల్లో ముంబయి మహానగరం ఒకటి. ఇప్పటికే పాజిటివ్ కేసులు లక్ష దాటింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితులు అదుపులోకి రావటంలేదు. ఈ క్రమంలో బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) ఈ వాయిస్ టెస్ట్ ద్వారా కరోనా పరీక్షలు చేసే సరికొత్త టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించుకుంది. దీంతో కరోనా కేసుల్ని గుర్తించి కట్టడి చేయటానికి యత్నిస్తోంది.