మోడీకి సిగ్గు.. లజ్జ లేదు.. అసమర్థుడు – బాబు ఘాటు వ్యాఖ్యలు
ఏపీ సీఎం బాబు మాటల వేడిని పెంచుతున్నారు. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకపడుతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

ఏపీ సీఎం బాబు మాటల వేడిని పెంచుతున్నారు. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకపడుతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
ఏపీ సీఎం బాబు మాటల వేడిని పెంచుతున్నారు. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకపడుతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సిగ్గు..లజ్జ ఉందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో పీఎం మోడీ ఏపీలో పర్యటించి బాబుపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా బాబు కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ 02వ తేదీ చిత్తూరు జిల్లా మదనపల్లె బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు..మోడీ కంటే గ్రామాల్లో ఉండే కిందిస్థాయి కార్యకర్త వెయ్యి రెట్లు నయం అంటూ అభివర్ణించారు.
Read Also : చంద్రగిరిలో చంద్రబాబు : జగన్ మోటా రౌడీ చెవిరెడ్డి చోటా రౌడీ
పోలవరం ఏటీఎం అంటూ మోడీ అంటున్నారని..ఆయకు సిగ్గు..లజ్జ..ఒక స్థానం లేని వ్యక్తి అన్నారు. పోలవరానికి డబ్బులు ఇవ్వలేదన్న బాబు..రూ. 58వేల కోట్లు అయితే రూ. 7వేల కోట్లు మాత్రమే ఇచ్చారు..మిగతా సొమ్ము ఎవరిస్తారు ? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు వారింటి నుండి డబ్బులు ఇవ్వడం లేదు..నీ అబ్బ సొమ్ము కాదు అంటూ వ్యాఖ్యానించారు.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని..మోడీ కాదన్నారు. మోడీ పచ్చి అబద్దాల కోరు..అన్నీ అసత్యాలే మాట్లాడుతాడు అన్నారు బాబు. మోడీ అసమర్థుడు..ఈ సంవత్సరం పోలవరం పూర్తి చేసి జులై నెలలో నీరు తీసుకొస్తా…అంటూ బాబు తెలిపారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ లీడర్స్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
Read Also : బస్సులో రూ.24లక్షలు : మహిళా మంత్రి అనుచరుడి నుంచి డబ్బు సీజ్