69వ పుట్టిన రోజు ప్రత్యేకతలివే : PMగా మోడీ బర్త్‌డే సెలబ్రేషన్స్ జెర్నీ

  • Published By: sreehari ,Published On : September 16, 2019 / 10:31 AM IST
69వ పుట్టిన రోజు ప్రత్యేకతలివే : PMగా మోడీ బర్త్‌డే సెలబ్రేషన్స్ జెర్నీ

Updated On : September 16, 2019 / 10:31 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17న తన 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మోడీతో పాటు దేశం కూడా ఆయన బర్త్‌డే స్పెషల్ సెలబ్రేషన్స్ జరుపుకోనుంది. వారమంతా సేవ సప్తాగా పాటించాలని బీజేపీ నిర్ణయించగా.. పలు రాష్ట్రాల్లో మోడీ పుట్టినరోజు వేడుకలను తమదైన రీతిలో జరుపుకోనున్నారు. మరోవైపు ప్రధాని మోడీ తన పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని తన ఇంటికి వెళ్లనున్నారు.

ముందుగా తన తల్లి హీరాబెన్ దగ్గరకు వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకోనున్నారు. మోడీ 69వ పుట్టినరోజున సర్దార్ సరోవర్ డ్యాం త్వరలో పూర్తిస్థాయి సామర్థ్యాన్ని (మైలు రాయి)ని చేరుకునే అవకాశం ఉంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ తన జన్మదిన వేడుకలను ప్రత్యేకించి ఎలా జరుపుకున్నారో ఓసారి చూద్దాం. 

2014.. 64వ పుట్టిన రోజు వేడుకలు :
* ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా తన తల్లి హీరాబెన్ (95)ను అహ్మదాబాద్‌లో కలిశారు. 
* తన 64వ పుట్టినరోజు వేడుకలను ఆమెతో కలిసి జరుపుకున్నారు. 
* తల్లిని అప్యాయంగా పలకరించి, ఆమె కాళ్లకు నమస్కరించి మోడీ ఆశీస్సులు తీసుకున్నారు. 
* తల్లి హీరాబెన్.. మోడీని దీవించింది. అనంతరం తన కుమారుడికి రూ.5వేల 001 బహుమతిగా ఇచ్చింది. 
* ఆ డబ్బును జమ్మూ కశ్మీర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కు మోడీ విరాళంగా ఇచ్చారు. అదే రోజున 
* అదే రోజున అహ్మదాబాద్ లో చైనీస్ అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి మోడీ ప్రత్యేక విందుకు హాజరయ్యారు.

2015.. 65వ పుట్టిన రోజు వేడుకలు :
 * తన పుట్టిన రోజున ప్రధాని నరేంద్ర మోడీ శౌర్యాంజలిని సందర్శించారు.  
* 1965 భారత్-పాక్ యుద్ధం జరిగి గోల్డెన్ జూబ్లీ అయిన సందర్భంగా మిలటరీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. 
* దేశం కోసం యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.
* మోడీ పుట్టిన రోజు సందర్భంగా 365 కిలోల లడ్డును ఆవిష్కరించారు. 
* ప్రభుత్వేతర సంస్థ సులాబ్.. మోడీ జన్మదినాన్ని స్వచ్ఛతా దివాస్ గా ప్రకటించింది. 
* న్యూఢిల్లీలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 
* 2015 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో సైనా రజతం గెలిచింది. 
* మోడీ పుట్టిన రోజున కలిసి ఆయనకు తాను ఆడే బ్యాట్‌ (రాకెట్)ను గిఫ్ట్‌గా ఇచ్చింది.

2016.. 66వ జన్మదిన వేడుకలు : 
* తన పుట్టిన రోజున గాంధీనగర్ లోని తన తల్లి హీరాబెన్ ఇంటికి మోడీ వెళ్లారు.
* తల్లి నుంచి ముందుగా ఆశీస్సులు తీసుకున్నారు. 
* ఆ తర్వాత.. నవసరిలో జరిగిన ఓ కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. 
* నవసరిలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు సహాయ పంపిణీ చేశారు.
* నవసరిలో 989 దీపాలను ఒకే సమయంలో వెలిగించడం అరుదైన ఘనత

2017.. 67వ జన్మదిన వేడుకలు : 
* తన పుట్టిన రోజున.. మెగా సర్దార్ సరోవర్ డ్యాం ప్రాజెక్టును దేశానికి అంకితం చేశారు. 
* విద్యార్థులు వేద శ్లోకాలను పఠిస్తుండగా మోడీ ప్రాజెక్టును ఆవిష్కరించారు. 
* 6 దశాబ్దాల క్రితమే సరోవర్ ప్రాజెక్టు సంభావితమైనట్టు మోడీ గుర్తు చేసుకున్నారు.
* నర్మదా డ్యాంను ప్రారంభించారు.. సర్దార్ ఆత్మ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
* సెప్టెంబర్ 16న మరణించిన భారత వైమానిక దళం అర్జన్ సింగ్ మార్షల్ నివాసాన్ని మోడీ సందర్శించారు. 

2018.. 68వ పుట్టిన రోజు వేడుకలు :
* తన పుట్టినరోజును పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పాఠశాల విద్యార్థులతో మోడీ గడిపారు.
* ప్రాథమిక పాఠశాలను సందర్శించి.. తన పుట్టినరోజును విద్యార్థులతో జరుపుకున్నారు. 
* పీఎం మోడీ విద్యార్థులకు కొన్ని బహుమతులు కూడా తెచ్చారు. 
* విద్యార్థులకు సోలార్ లాంప్, స్టేషనరీ, స్కూల్ బ్యాగ్స్, నోట్‌బుక్‌లు అందించారు.
* అనంతరం.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
* మహాత్మా గాంధీ స్థాపించిన నవజీవన్ ట్రస్ట్, పరీక్షా వారియర్స్ గుజరాతీ వెర్షన్‌ను పిఎం మోడీ ప్రచురించారు. 
* నవజీవన్ ట్రస్ట్ ప్రచురించిన భారతదేశపు మూడవ ప్రధానమంత్రిగా మోడీ పుట్టినరోజు మరింత ప్రత్యేకమైంది.
* 68వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మంత్రులు 568 కిలోల లడ్డూను కూడా ఆవిష్కరించారు.

2019.. 69వ పుట్టిన రోజు ప్రత్యేకతలివే :
* నర్మదా జిల్లాలోని కేవాడియాలోని సర్దార్ సరోవర్ డ్యాంలో నీటి మట్టాన్ని చేరుకోనుంది. 
* అదే రోజున ప్రధాని మోడీ 69వ పుట్టినరోజు వేడుకలు ప్రారంభం కానున్నాయి. 
* తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. 
* వికలాంగ పిల్లలతో మోడీ తన పుట్టినరోజుంతా గడుపుతారని నివేదికలు చెబుతున్నాయి. 
* మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు బిజెపి ‘సేవా సప్తా’ (సేవా వారం) పాటించనుంది.
* న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా, విజయ్ గోయెల్, విజయేందర్ గుప్తాలతో కలిసి సేవా సప్తా ప్రారంభించారు.
* మోడీ చేసిన సామాజిక పనులను వివరించే అనేక ప్రదర్శనలు కూడా నిర్వహించనుంది.
* మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతపై ప్రతి జిల్లాలో ప్రదర్శనలను నిర్వహిస్తారు.
* ప్రధాని మోడీ సామాజిక సందేశాలను చేరేలా ఢిల్లీ నుంచి గుజరాత్‌లోని తన జన్మస్థలం వాడ్నగర్ వరకు బైక్ ర్యాలీ.
* ఏస్ బైకర్ రాజ్ లక్ష్మి నేతృత్వంలో సెప్టెంబర్ 20న బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.  
* నాలుగు రాష్ట్రాల మీదుగా 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బైక్ ర్యాలీ వాడ్నగర్ చేరుకోనుంది.
* మోడీ 69వ పుట్టినరోజు సందర్భంగా 7వేల కిలోల బరువున్న 700 అడుగుల కేక్‌ను తయారు చేయనున్నట్లు సూరత్ బేకరీ ప్రకటించింది. 
* సూరత్ నుంచి మోడీ జన్మదిన వేడుకల్లో పాల్గొనే 700 మంది ‘నిజాయితీపరులు’ కేక్‌ కట్ చేస్తారు.