బిడ్డను ప్రసవించి గతం మరచిపోయిన తల్లి: నర్సు అమ్మ మెదడుపై కరోనా దెబ్బ

  • Published By: nagamani ,Published On : August 4, 2020 / 12:32 PM IST
బిడ్డను ప్రసవించి గతం మరచిపోయిన తల్లి: నర్సు అమ్మ మెదడుపై కరోనా దెబ్బ

Updated On : August 4, 2020 / 12:50 PM IST

కరోనా కష్టం ఎంత దారుణంగా ఉందంటే..పండంటి బిడ్డను ప్రసవించిన ఆ తల్లి గతం మరిచిపోయేంత..! తాను గర్భవతిని అనేమాట మరిచిపోయేంత…!! తాను బిడ్డను ప్రసంచాననీ..తాను తల్లినయ్యానని..బోసినవ్వుల పసిబిడ్డ పక్కనే ఉన్నా..ఒడిలో ఉన్నా సరే గుర్తుపట్టలేనంత…!!! ఓ నర్సు గర్భవతిగా ఉండగా కరోనా మహమ్మారి సోకింది. అదృష్టవశాత్తు కరోనాను జయించింది. కానీ గతం మాత్రం మరిచిపోయింది. ఆమె గర్భం ధరించిన విషయమే మరచిపోయిన బాధాకర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.



కరోనా కాలం ఎవరిని కదిపినా కష్టాల కలబోతలే. ఎంతోమంది జీవితాల్లో కరోనా కల్లోలాను నింపుతోంది. కరోనా కష్టాల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు ప్రజలు.ఎటూచూసినా, ఎవరిని కదిపినా గుండె బరువెక్కించే విషాద ఘటనలే. ప్రపంచంలో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో కరోనా మహమ్మారితో పోరాడతున్నవారే. ఈక్రమంలో న్యూయార్క్‌లోని బ్రూక్లేన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలిస్తే తప్పకుండా కళ్లు చెమ్మగిల్లుతాయి.

బ్రూక్‌డాలే యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సెంటర్‌లో లేబర్ అండ్ డెలివరీ నర్సుగా పనిచేస్తున్న సెల్వియా అనే 35 నర్సుకు గర్భవతిగా ఉన్నప్పుడే కరోనా సోకింది.చికిత్స పొందుతున్న రెండు వారాల తర్వాత ఏప్రిల్ 12న గుండె నొప్పికి గురై ఎంతో బాధననుభవించిది. అప్పటికే ఆమె 30 వారాల గర్భవతి. ఆమె సాధారణ స్థితికి వచ్చిన తరువాత డాక్టర్లు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు.




ఈ సమయంలో ఆమె ఆక్సిజన్ లేకుండా నాలుగు నిమిషాలు ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమె మెదడుకు గాయమైంది. ఫలితంగా గతాన్ని మరిచిపోయింది. కనీసం తాను గర్భవతినని విషయంగానీ..తనకు వైరస్ సోకి హాస్పిటల్‌లో ఉన్నానని విషయంకూడా ఆమెకు తెలీలేని పరిస్థితిలో ఉంది. అది గుర్తించిన డాక్టర్లు ఆమెను సాధారణ స్థితికి తేవటానికి శతవిధాలా యత్నించారు.

సెల్వియా..అంటూ ఆదరంగా..ప్రేమగా పిలిచి..నీకు బిడ్డ పుట్టింది..చూడు ఎంత ముద్దుగా ఉందో అంటూ ఎంతగానో చెప్పారు.కానీ ఆమెలో ఎటువంటి చలనం లేదు. అలా శూన్యంలోకి చూస్తు ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకశక్తిని తిరిగి తెచ్చేందుకు వైద్య నిపుణులు యత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రతీరోజూ బిడ్డ గురించి..ఆమె గతం గురించి గుర్తు చేస్తున్నారు..ఆమెలో కదలిక వస్తుందని ఎదురు చూస్తున్నారు.

సెల్వియా తన భర్తను గానీ అప్పటికే ఆమెకు ఉన్న మూడేళ్ల కుమారుడిని కూడా గుర్తుపట్టలేకపోతోంది. గుర్తించటానికి అవస్థలు పడుతోంది. ఆమె త్వరగా కోలుకుని పసిబిడ్డను అక్కున చేర్చుకోవాలని కోరుకుందాం. ఇటువంటి కరోనా కష్టం మరెవ్వరికీ రాకూడదని కోరుకుందాం…