పెళ్లైన రెండు రోజులకే.. పెళ్లికొడుకు మృతి!

పెళ్లి జరిగిన రెండు రోజులకే పెళ్లి కుమారుడు చనిపోయిన విషాద సంఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగళి కిషోర్‌కు రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. అయితే కాళ్లపారాణి ఆరక ముందే నవ వరుడు చనిపోయాడు. పెళ్లైన రెండవ రోజే పని నిమిత్తం బయటకు వచ్చిన కిషోర్ ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ దాటుతుండగా.. రైలు ఢీకొని మృతిచెందాడు. నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పెళ్లి జరిగిన రెండు రోజులకే చనిపోవడంతో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.