ఒంగోలులో అభ్యర్థులు ఎదురెదురు : కార్యకర్తల ఘర్షణ

ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉదయం నుండి ఉద్రిక్తత పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీ – టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒంగోలులో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడున్న 47వ పోలింగ్ బూత్ వద్దకు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌లు ఒకేసారి వచ్చారు. దీనితో వారికి అనుకూలంగా ఆయా పార్టీల నేతలు నినాదాలు చేశారు. బాలినేని డౌన్ డౌన్ అంటూ టీడీపీ వారు.. దామచర్ల డౌన్ డౌన్ అంటూ వైసీపీ నేతల నినాదాలతో మారుమోగిపోయింది. ఒకరినొకరు తోసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా కృషి చేశారు.