తినే పదార్థం అనుకుని బాంబును కొరికిన ఎద్దు.. తర్వాత ఏమైందంటే?

  • Published By: vamsi ,Published On : November 4, 2019 / 08:08 AM IST
తినే పదార్థం అనుకుని బాంబును కొరికిన ఎద్దు.. తర్వాత ఏమైందంటే?

Updated On : November 4, 2019 / 8:08 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కృష్ణాపురంలో మేతకు వెళ్లిన ఎద్దు తినే పదార్ధం అనుకుని నాటు బాబును కొరకడంతో అది ఒక్కసారిగా పేలింది. కౌండిన్య అటవీ ప్రాంతానికి మేతకోసం వెళ్లిన ఎద్దు, వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును కొరకగా ఈ ఘటన చోటుచేసుకుంది.

బాంబు పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. అప్పుడు అక్కడకు వెళ్లి చూసినవారికి ఎద్దు దవడలు పూర్తిగా పేలిపోయి చర్మం వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో పక్కన జంతువులు కానీ, మనుషులు కానీ లేరు.

అనంతరం యజమాని, ఎద్దును గ్రామానికి తోలుకొచ్చాడు. వేటగాళ్లు ఈ ప్రాంతంలో దుప్పుల కోసం అమర్చిన ఉంటను తినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మైలేరు పండుగల్లో పలు బహుమతులు గెలిచిన ఈ ఎద్దు విలువ లక్షకు పైగా ఉంటుందని రైతు చెబుతున్నాడు.