పద్మశ్రీ అవార్డు రైతులకు అంకితం – యడ్లపల్లి

  • Published By: madhu ,Published On : January 26, 2019 / 09:52 AM IST
పద్మశ్రీ అవార్డు రైతులకు అంకితం – యడ్లపల్లి

Updated On : January 26, 2019 / 9:52 AM IST

గుంటూరు : పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని వ్యవసాయవేత్త యడ్లపల్లి వెంకటేశ్వరరావు. పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. పద్మశ్రీ అవార్డును రైతు సోదరులకు అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. లాభసాటి వ్యవసాయం కోసం 2005లో రైతు నేస్తం ఫౌండేషన్‌ను స్థాపించడం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తితో ఏమీ కాదని..రైతులందరూ సమిష్టి కృషి ఎంతగానో తోడ్పడిందన్నారు. 

ఇక యడ్లపల్లి విషయానికి వస్తే…గుంటూరు జిల్లా చెరుకూరు మండలం కొర్నేపాడులో 1968లో జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఈయన…వ్యవసాయం చేస్తూ పెరిగాయి. ఇతను రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడికి నిరంతరం కృషి చేస్తున్నారు.  రైతునేస్తం ఫౌండేషన్‌ ద్వారా ప్రతి ఆదివారం కొర్నేపాడులో రసాయన రహిత సేద్యం, మిద్దెతోట, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత, సేంద్రియ ఉత్పత్తుల అవసరం.. తదితర అనేక అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.