జగన్ కు కౌంటరిచ్చిన  పవన్ కళ్యాణ్

  • Published By: chvmurthy ,Published On : March 27, 2019 / 02:56 PM IST
జగన్ కు కౌంటరిచ్చిన  పవన్ కళ్యాణ్

Updated On : March 27, 2019 / 2:56 PM IST

మార్కాపురం: ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సరికి నాయకులు ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ పార్టనర్ యాక్టర్, యాక్టర్ టీడీపీ  పార్టనర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు.

ఉన్నత కుటుంబంలో పుట్టిన జగన్.. తన పేరు ఉచ్చరించడానికి నామూషీగా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. తాను యాక్టర్‌ని అని గర్వంగా చెప్పుకుంటానన్న పవన్.. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన జగన్.. ఏమని చెప్పుకుంటారని విమర్శించారు. రెండేళ్లు జైల్లో ఉండొచ్చిన జగన్.. గాంధీలా బిల్డప్ ఇస్తున్నారంటూ పవన్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.