చిదంబరానికి పట్టిన గతే బొత్సకు పడుతుంది : పవన్ జోస్యం
ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పెద్దరికం నిలబెట్టుకోవాలన్నారు. జగన్ మాయలో పడొద్దని హితవు పలికారు.

ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పెద్దరికం నిలబెట్టుకోవాలన్నారు. జగన్ మాయలో పడొద్దని హితవు పలికారు.
ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పెద్దరికం నిలబెట్టుకోవాలన్నారు. జగన్ మాయలో పడొద్దని హితవు పలికారు. సీఎం కావాలని బొత్సకు ఏమూలనో ఉందన్నారు. శనివారం (ఆగస్టు 31, 2019)వ తేదీన మంగళగిరిలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిని బొత్స వ్యతిరేకిస్తే.. మోడీ, అమిత్ షాను వ్యతిరేకించినట్లేనని అన్నారు. వోక్స్ వ్యాగన్ కేసులను మరిచిపోవద్దని..గుర్తుంచుకోవాలన్నారు. బొత్స జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. చిదంబరానికి పట్టిన గతే బొత్సకు పడుతుందని హెచ్చరించారు. ఇతర నాయకులు కూడా ఆయనలా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు.
జగన్ కుటుంబ సభ్యులు గానీ, సన్నిహుతులు గానీ ఎవరూ చెడు ప్రకటనలు చేయడం లేదని..చెడు వార్తలకు బాధ్యులు కావొద్దని బొత్సకు విన్నవిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో బొత్స సీఎం అవుతారేమో.. దాన్ని దృష్టిలో ఉంచుకొని బొత్స ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలన్నారు. ఉమ్మడి రాష్ట్రం చివరి సీఎం అవుతామనుకుని బొత్స అనుకున్నా అప్పట్లో జరగలేదన్నారు. భవిష్యత్ లో అది జరగొచ్చేమో అని పవన్ వ్యంగాస్త్రాలు సంధించారు.
151 ఎమ్మెల్యేలు ఉన్నారని ధీమాగా ఉండొద్దన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. అధికారం ఎప్పుడు ఒకరి పక్షాన ఉండదన్నారు. వైసీపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదన్నారు. కాలం కలిసొచ్చి గెలిచారో, ఈవీఎంల గొప్పతనమో తనకు తెలియదన్నారు. మోడీ అనుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని…వైసీపీ ఓడిపోవచ్చన్నారు.