రూ.10 లక్షల బీమా: మధ్యతరగతికి పవన్ హామీలు

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 07:51 AM IST
రూ.10 లక్షల బీమా: మధ్యతరగతికి పవన్ హామీలు

Updated On : April 1, 2019 / 7:51 AM IST

ఆచంట : ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి రూ.10లక్షలు ఆరోగ్య బీమాను కల్పిస్తామని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచంట ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.  దిగువ మద్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు ఆ కష్టాలేమిటో తెలుసని..ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యం ఉంటుందని అందుకే మధ్య తరగతివారికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. 
 

కొబ్బరి తోటల్లో పనిచేసే కూలీలకు ప్రత్యేక బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రతీ ఆడపడుచుకు ఏడాదికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత జనసేనదన్నారు. ఇది ఎలా సాధ్యపడుతుందనే అనుమానం ప్రతీ ఒక్కరికి వస్తుందనీ..సూట్ కేస్ లక్షల కోట్ల డబ్బును విదేశాలలో దాచుకోవటం మానివేస్తే ప్రజలు ఇటువంటి పలు పథకాలు
అమలు చేయటం సాధ్యమేనని పవన్ స్పష్టంచేశారు. దళారీ వ్యవస్థను అరికడితే ప్రజలకు సౌకర్యవంతమైన..సంతోషకరమైన పాలనను అందించవచ్చనీ తెలిపారు. సంపాదనకు సంబంధం లేకుండా ప్రజలకు  సుపరిపాలన అందించే బాధ్యత జనసేనదని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆడపిల్లల చదువులకు, పెళ్లిళ్లకు కావాల్సిన భరోసాను జనసేనదేనన్నారు.  ప్రతీ మధ్య తరగతి వారికి ఇంటి స్థలం గానీ..స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టించేందుకు నిర్ధిష్ట ప్రణాళికలను జనసేన పార్టీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

ఆచంటలో ప్రతీ మండలానికి డిగ్రీ కాలేజ్ ను..చదువుకున్న యువతకు స్కిల్ డెవలప్ మెంట్  ఏర్పాటు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.  అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్ధులపై ఉండే అక్రమ కేసుల్ని జనసేన అధికారంలోకి వస్తే వాటిని కొట్టివేస్తామని