పవన్ కళ్యాణ్ టీడీపీ కోవర్ట్ : మంత్రి పెద్దిరెడ్డి

పవన్ కళ్యాణ్ టీడీపీ కోవర్ట్ అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ 2 స్థానాల్లో పోటీ చేసి ఒక్కచోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదని ఎద్దేవా చేశారు. రాజధానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. టీడీపీ నేతలు భూముల చిట్టాను సబ్ కమిటీ తేలుస్తుందన్నారు.
అమరావతి చుట్టూ కొన్న భూములు పోతాయన్న భయం టీడీపీ నేతల్లో ఉందన్నారు. రాజధాని మారుతుందని మంత్రి బొత్స చెప్పలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రజలకు మేలు జరిగేలా రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెల 5న నూతన పాలసీని ప్రకటిస్తామని చెప్పారు.