స్వరం మారింది : పవన్ కింగ్ మేకర్ అవుతారా

జనసేనాని పవన్ కల్యాణ్…క్రమంగా స్వరం మారుతోందా ? అధికారంపై వ్యామోహం లేదంటూనే…సీఎం పదవిపై కన్నేశారా.. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్…ఇప్పుడు ఒంటరిగా ఎందుకు పోటీ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి…ఏపీలో కింగ్ మేకర్ కావాలని ప్రయత్నిస్తున్నారా….? ఏపీ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో TDP, BJP కూటమికి మద్దతిచ్చారు. వారి తరపున ప్రచారం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తుందంటూ భరోసా కల్పించే ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి సూపర్ విక్టరీ కొట్టి…ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Read Also : పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు
ఏపీలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత…టీడీపీ, బీజేపీ నేతలతో కొద్ది రోజుల సఖ్యతగానే మెలిగారు జనసేనానీ. తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ కూటమి నుంచి బయటకు రాగానే పవన్ కల్యాణ్ స్వరంలో మార్పు వచ్చింది. తెలుగుదేశం పాలనలో అవినీతి పెరిగిపోయిందంటూ వీలు దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు భూకబ్జాలు, ఇసుక దందాలు చేస్తూ… అవినీతి మునిగిపోయారంటూ ఆరోపణలు చేశారు. సర్పంచ్‌గా కూడా గెలవని లోకేశ్‌కు….మంత్రి పదవి ఎలా కట్టబెట్టారంటూ ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ తీరును ఎండగడుతూ వచ్చారు పవన్ కల్యాణ్. అధినేతగా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం సంగతి అటుంచితే….కనీసం ఎమ్మెల్యేలు హాజరుకాకుండా అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. అధికార విపక్షాలను దూరం పెడుతూ వచ్చిన జనసేనాని…క్రమంగా తన పార్టీ బలోపేతం దృష్టి పెట్టారు. జిల్లాల్లో పర్యటిస్తూ…ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధానం సమస్యను తెరపైకి తీసుకొచ్చి….పరిష్కారం చూపించారు.
జనసైన్యం సత్తా చాటేందుకు….అనంతపురం, రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. జనసేన కవాతుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినా జనంతో తనకు బలం, బలగం ఉందంటూ చాటి చెప్పారు. నిరుద్యోగం, విద్య, వైద్యంలో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టారు. ఎన్నికల్లో పోటీ చేసి చక్రం తిప్పాలని భావించిన పవన్…వామక్షాలతో పాటు బీఎస్పీతో సీట్ల సర్దుబాటు చేసుకొని కదనరంగంలోకి దూకారు. కింగ్ అవకపోయినా ఫర్వాలేదు కాని…కింగ్ మేకర్ కావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరి అవుతారా ? లేదా ? అనేది చూడాలి మరి.
Read Also : ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?